ఈ శివరాత్రి విజేత ఎవరో..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇంతకుముందున్న పరిస్థితి ఇప్పుడు లేదు. నమ్మకాలు కూడా రోజు రోజుకీ తగ్గిపోతున్నాయి. ఒకప్పుడు సినిమా ఎన్ని రోజులు ఆడిందని చూసేవారు కానీ ఇప్పుడు ఎంత కలెక్ట్ చేసిందని మాట్లాడుకుంటారు. సినిమా ఇవాళ రిలీజ్ అయిందంటే చాలు వెంటనే అది హిట్టా ఫట్టా అన్నది తేల్చేస్తున్నారు. పెట్టిన బడ్జెట్ లో మినిమం వసూల్ చేస్తే సినిమా హిట్. లేదంటే ఫ్లాప్. ఇలాంటి నేపథ్యంలో సినిమాలన్నీ రిలీజ్ కు రెడీ అయ్యాయి. మామూలుగా అయితే గత నెల, ఈ నెల అంటే ఫిబ్రవరి, మార్చి నెలలను సీజన్ లా చెప్పుకోరు. కానీ కరోనా తర్వాత ఇవేమీ పట్టించుకోవట్లేదు. దీంతో మార్చి 11న శివరాత్రి కాబట్టి టాలీవుడ్ లో బాగానే సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. గాలి సంపత్, శ్రీకారం, జాతిరత్నాలు ఈ మూడు పేర్లు బాగా వినిపిస్తున్నాయి. ఈ మూడింట్లో కాస్త పెద్ద సినిమా అంటే శ్రీకారం అనే చెప్పాలి. ఆ తర్వాత గాలి సంపత్, ఆ తర్వాత ఆఖరన జాతి రత్నాలు. కానీ కంటెంట్ పరంగా చూస్తుంటే ఏ సినిమాకు ఆ సినిమాకు పోటీ గానే కనిపిస్తుంది.
కానీ జనాలు ఎక్కువ ఆసక్తికరంగా ఉన్న సినిమా మాత్రం జాతి రత్నాలు. ప్రేక్షకులు ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్న నేపథ్యంలో ఈ సినిమా కాస్త ఎంటర్టైన్ చేస్తే మాత్రం శివరాత్రి విన్నర్ గా నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జాతి రత్నాలు ఫుల్ టైమ్ కామెడీ ఎంటర్టైనర్ అని టీజర్ చూస్తేనే అర్థమవుతుంది. ట్రైలర్ కూడా ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. మరి జాతి రత్నాలు గా నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ఏ మాత్రం ఆకట్టుకుంటారో చూడాలి.













