చవితికి బాగానే పోటీ ఉందే!
టాలీవుడ్ లో సీజన్ తో సంబంధం లేకుండా ప్రతీ వారం పోటీలు ఎక్కువయ్యాయి. ఏదైనా పండగ సీజన్ ఉండి సెలవులొస్తాయంటే ఆ పోటీ మరీ ఎక్కువైపోతుంది. ఒకప్పుడు సంక్రాంతి సీజన్‌కే ఎక్కువ పోటీ ఉండేది. ఇప్పుడు దసరా, దీపావళితో పాటూ వినాయక చవితి కూడా లిస్ట్ లోకి చేరింది. ఈసారి వినాయక చవితికి మూడు కంటెంట్ ఉన్న సినిమాలు రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. వాటిలో మొదటిది విజయ్- వెంకట్ ప్రభు కాంబోలో వస్తున్న గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. టైమ్ ఫిక్షన్ డ్రామాగా వస్తోన్న ఈ సినిమా మీద అన్ని భాషల్లోనూ మంచి అంచనాలున్నాయి. తుపాకీ నుంచి టాలీవుడ్ లో విజయ్ కు మార్కెట్ బాగా పెరిగింది. ఈ సినిమా సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తర్వాత రోజున నారా రోహిత్ సుందరకాండ రిలీజ్ కానుంది.
టీజర్ లో విజువల్స్, ఇన్ సైడ్ టాక్ చూస్తుంటే సినిమాపై పాజిటివ్ వైబ్స్ బాగానే ఉన్నాయి. ఇక మూడోది వెంకీ అట్లూరి- దుల్కర్ సల్మాన్ కాంబోలో వస్తున్న లక్కీ భాస్కర్ సెప్టెంబర్ 7న రిలీజ్ కానుంది. ఈ మూడు సినిమాల పోటీ ఆల్మోస్ట్ ఫిక్స్ అయినట్లే. ఆగస్ట్ నెలలో డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్, సరిపోదా శనివారం లాంటి క్రేజీ సినిమాలుండటం వల్ల మిగిలిన సినిమాలకు సెప్టెంబరే ఆప్షన్ అయింది. మరి ఈ మూడు సినిమాల్లో ఎవరు విజేతగా నిలుస్తారో చూడాలి.













