గేమ్ ఛేంజర్ కు ఉన్న ఆప్షన్స్ ఇవే
ఇండియన్2 ఫలితాన్ని తట్టుకుని దాన్నుంచి బయటకి వచ్చిన డైరెక్టర్ శంకర్ గేమ్ ఛేంజర్ వర్క్స్ ను వేగవంతం చేశాడు. రామ్ చరణ్ లేని బ్యాలెన్స్ సీన్స్ ను షూట్ చేయడంతో పాటూ చెన్నైలో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ను కూడా వేగవంతం చేశాడు. గేమ్ ఛేంజర్ ఫైనల్ కాపీ రెడీ అయ్యేవరకు రిలీజ్ డేట్ గురించి మాట్లాడనని శంకర్ ముందే చెప్పాడు. నిర్మాత దిల్ రాజు కు కూడా శంకర్ ఏ డేట్ నూ చెప్పలేదని సమాచారం. పాన్ ఇండియా స్థాయిలో వస్తున్న సినిమా కాబట్టి ముందే ఓ డేట్ అనుకుని దానికి అనుగుణంగా ప్రమోషన్స్ ను ప్లాన్ చేసుకోవాలి. కాబట్టి రిలీజ్ డేట్ విషయంలో ఏదొక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఇప్పుడు గేమ్ ఛేంజర్ ముందు మూడు మార్గాలున్నాయి.
అక్టోబర్ లో రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి డిసెంబర్ ఒకటే గేమ్ ఛేంజర్ ముందున్న ఆప్షన్. ఒకవేళ పుష్ప మరోసారి వాయిదా అంటున్న వార్తలు నిజమైతే ఆ డేట్ ను గేమ్ ఛేంజర్ వాడుకోవచ్చు. లేదంటే డిసెంబర్ 20కు వెళ్లాలి. దీంతో ఆల్రెడీ ఆ డేట్ కు లాక్ అయిన తండేల్ వాయిదా పడే ఛాన్సుంటుంది. నితిన్ రాబిన్ హుడ్ డిసెంబర్ 20 కంటే ముందొస్తుందంటున్నారు. కానీ ఇదంత ఈజీగా జరిగే పని కాదు. ఒకవేళ డిసెంబర్ కాకపోతే సంక్రాంతికి విశ్వంభర ఉంది కాబట్టి ఆ సీజన్ ను వదిలేయాలి. కాబట్టి గేమ్ ఛేంజర్ రిలీజైతే డిసెంబర్ లో అవాలి లేకపోతే మార్చి లేదా సమ్మర్ ను ఎంచుకోవాలి. మరి ఈ రిలీజ్ డేట్ సస్పెన్స్ ను శంకర్ ఎప్పుడు ఎండ్ కార్డ్ వేస్తాడో చూడాలి.













