ప్రేమ ఎంత మధురం అనే చెప్పే ఈ ప్రేమికుల వారాన్ని రియల్ లైఫ్ జంటలతోటి జరుపుకుంటున్న జీ తెలుగు
కొత్తదనం అంటే జీ తెలుగు, జీ తెలుగు అంటే కొత్తదనం అనేంతగా మనందరి ప్రియతమ ఛానల్ జీ తెలుగు మారుతుంది. ఎప్పుడూ తెలుగు వారి లోగిలల్లో మెరుస్తూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న మన జీ తెలుగు వాలెంటైన్స్ వీక్ కోసం మరింత వినోదాన్ని, ప్రేమని పంచడానికి సిద్దమయింది. తెలుగు టెలివిజన్ చరిత్రలోనే మొదటి సారి ఒక టైటిల్ సాంగ్ ని నిజజీవితంలో కూడా భార్యాభర్తలైన వారితో చిత్రీకరించారు.
ప్రేమ ఎంత మధురం టైటిల్ సాంగ్, సీరియల్ రెండు ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మన అభిమాన ఛానల్ ఎప్పుడూ కనీవినీ ఎరుగని రూపంలో ఆ టైటిల్ సాంగ్ చిత్రీకరణ చేసి అందరి ముందుకు తీసుకొచ్చింది. డిసెంబర్ 2021 చివరి వారంలో జీ తెలుగు మరియు ప్రేమ ఎంత మధురం అభిమానులు పండుగ పండుగ చేసుకున్నారు. క్రిస్మస్ లేదా న్యూ ఇయర్ పండుగ కాదు, ప్రేమ ఎంత మధురం పండుగ. ఎందుకంటే, ఛానల్ #ప్రేమఎంతమధురం కాంటెస్ట్ గురించి అందరికి తెలియచేసింది. ఆర్యవర్ధన్ (వెంకట్ శ్రీరామ్) మరియు అను (వర్ష హెచ్ కే) ఇరువురు కలిసి ఈ కాంటెస్ట్ గురించి వివరించారు.
ఎందరో వందలాది మంది ఈ కాంటెస్ట్ కి వారి వివరాలు పంపించంగా అందులో నుంచి మూడు జంటలను (భవ్య శ్రీ – రాహుల్, దీప్తి – మహేష్ మరియు ప్రదీశా – సందీప్) ఆర్య – అను మరియు ఛానల్ కలిసి సెలెక్ట్ చేసారు. ప్రేమ కు అడ్రస్ గా మారిన ప్రేమ ఎంత మధురం సీరియల్ టైటిల్ సాంగ్ ని ఈసారి కూడా అద్భుతమైన లొకేషన్స్ లో చిత్రీకరించారు. ఆ మూడు జంటలు అను – ఆర్య తో టైటిల్ సాంగ్, చిత్రీకరణలో పాల్గొన్నారు, అంతే కాకుండా వారితో ఎన్నో మధురానుభూతాలు పంచుకున్నారు. ఒక్కొక్క జంటది ఒక్కో మధురమైన కథ. ఆ జంటల ఊసులు ఛానల్ – సోషల్ మీడియా ద్వారా అందరికి తెలియచేసింది
Link (Title song) – https://www.youtube.com/watch?v=AeReI20xEEE&t=45s
Link (BTS) – https://www.youtube.com/watch?v=XjP3PzwlIcY
స్వచ్ఛమైన ప్రేమకు డబ్బు, కులం, మతం, ఆస్తులు, అంతస్తులు లాంటి పట్టింపులు ఉండవు. అలాగే స్వచ్చమైన ప్రేమకు వయస్సు కూడా అడ్డంకి కాదు. ఇదే కాన్సెప్ట్‌తో రూపొందించిన సీరియల్ ప్రేమ ఎంత మధురం ప్రతి సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 9 గంటలకు మీ జీ తెలుగు లో ప్రసారమవుతుంది. టైటిల్ సాంగ్ చూసారా? చూడని వాళ్ళు వెంటనే జీ తెలుగు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ లలో ఆ జంటలు ఒకరి మీద ఒక కురిపించే ప్రేమ మధురాన్ని తొందరగా చూసేయండి.













