ఒకటి, రెండు కాదు ఏకంగా 24 ముద్దులు
ఒకటి, రెండు కాదు ఏకంగా 24 ముద్దులు ఉన్నాయి. ముద్దు కోసం ముద్దు అన్నట్టు, హీరో హీరోయిన్లు కావాలని పెటుకున్నట్టు కాకుండా, కథలో భాగంగా 24 ముద్దులు వస్తాయట. అందుకని, టైటిల్ 24 కిసెస్ అని పెట్టారు. అదిత్ అరుణ్, హెబ్బా పటేల్ జంటగా నటించిన ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ఎ సర్టిఫికేట్ ఇచ్చింది. అంటే, ఈ ముద్దుల సినిమా పెద్దలకు మాత్రమే అన్నమాట. సంజయ్‌రెడ్డి, అనిల్ పల్లాలతో కలిసి చిత్రాన్ని నిర్మించిన అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి, ఈ చిత్రానికి దర్శకుడు కూడా. అదిత్, హెబ్బా మధ్య కెమిస్ట్రీ చిత్రానికి హైలెట్‌గా నిలుస్తుంది. ఈ నెల 26న చిత్రాన్ని విడుదల చేస్తాం అని నిర్మాతలు తెలిపారు.













