జయప్రకాశ్ రెడ్డికి అరుదైన గౌరవం
విలక్షణ నటనతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు జయప్రకాష్రెడ్డికి అరుదైన అవార్డు వరించింది. ఫిల్మ్ ఎనలిటికల్ అండ్ అప్రిషియేషన్ సొసైటీ (ఫాస్)-అక్కినేని 2018 లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుకు ఆయన ఎంపికయ్యారు. సినీ, టీవీ, సాంస్కృతిక రంగాల్లో విశిష్ట ప్రతిభను కనబరిచిన కళాకారులను ఫాస్ గత 20 ఏండ్లగా ఘనంగా సన్మానిస్తుంది. అలాగే ఈ ఏడాది కూడా ఫాస్-అక్కినేని 2018 అవార్డులను అదించనున్నట్టు ఫాస్ అధ్యక్షులు కె.ధర్మరావు తెలిపారు. ఈ నెల 30న విజయవాడలోని వెలిదండ్ల హనుమంతరాయ గ్రంథాలయం ఆడిటోరియంలో జరిగే ఈ వేడుకలో ఎ.పి.ఎస్.ఆర్.టి.సి చైర్మన్ వర్ల రామయ్య అవార్డు గ్రహీతలను సన్మానిస్తారు అని కె.ధర్మరావు తెలిపారు.













