సారగదరియా.. మరో రికార్డు

నాగచైతన్య హీరోగా సాయిపల్లవి హీరోయిన్‍గా శేఖర్‍కమ్ముల దర్శకత్వంలో లవ్‍స్టోరీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో సారగదరియా పాట తాజాగా యూట్యూబ్‍లో 200 మిలియన్ల వ్యూన్ సాధించింది. సుద్దాల అశోక్ తేజ రాసిన ఈ పాటను మంగ్లీ మనోహరంగా ఆలపించారు. ఫిబ్రవరి 28న విడుదలైన ఈపాట కేవలం 14 రోజుల్లోనే 50 మిలియన్ల వీక్షణలు సాధించింది. ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నారు. నారాయణదాస్ కె.నారంగ్, రామ్మోహన్‍రావ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఫ్రెష్ అండ్ ఫీల్ గుడ్ మూవీగా తీర్చిదిద్దుతున్నారు.