సునీల్ ‘టూ కంట్రీస్’ ట్రైలర్ విడుదల
సునీల్, మనీషా రాజ్ జంటగా నటించిన తాజా చిత్రం ‘2 కంట్రీస్’. ఎన్.శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మలయాళంలో విజయం సాధించిన ‘టూ కంట్రీస్’ (2015) ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ట్రైలర్లో విలన్ దేవ్‌గిల్ సునీల్‌తో ‘తెల్లబట్టలు వేసుకున్న ప్రతీవాడూ ఫ్యాక్షనిస్ట్ కాలేడు’ అంటే ఇందుకు సునీల్ ‘నల్లబట్టలు వేసుకున్న ప్రతీవాడూ అయ్యప్పస్వామి భక్తుడు కాలేడు’ అని చెబుతున్న డైలాగ్ నవ్వులు పూయిస్తోంది.
ఈ చిత్రంలో సునీల్‌కి జోడీగా మనీశా రాజ్, సంజన గల్రానీ నటిస్తున్నారు. పృథ్వీ(30 ఇయర్స్ ఇండస్ట్రీ), రాజా రవీంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గోపీ సుందర్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. శ్రీధర్ సీపన డైలాగులు రాశారు. డిసెంబర్ 29న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.













