ఆ బ్యానర్ నుంచి ఈ ఏడాది 15 సినిమాలు
ఏదేమైనా ఇప్పుడు సినిమాలు తీయడానికి ఎక్కువ టైమే పడుతుంది. ఒకప్పుడు సీనియర్ హీరోలైన ఎన్టీఆర్, కృష్ణ లాంటి హీరోలు సంవత్సరానికి పదికి పైగా సినిమాలు రిలీజ్ చేసేవాళ్లు. ఇప్పుడు స్టార్ హీరో నుంచి ఏడాదికి కనీసం ఒక్క సినిమా రావడం కూడా కష్టమైపోతుంది. హీరోల సంగతి పక్కన పెడితే నిర్మాతలకైతే ఇది సాధ్యం కాదు.
కానీ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ ఏడాదిలో ఏకంగా తమ బ్యానర్ నుంచి 15 సినిమాలు రాబోతున్నాయని చెప్పి షాక్ ఇచ్చారు. పెద్ద పెద్ద నిర్మాతలైన అశ్వినీదత్, రామానాయుడు, అల్లు అరవింద్ లాంటి వాళ్లు కూడా ఇప్పటి వరకు ఏడాదిలో ఇన్ని సినిమాలు రిలీజ్ చేసింది లేదు. సంవత్సరానికి ఆరు సినిమాలు చేయడమే గొప్ప.
అలాంటిది 15 సినిమాలంటే అందరూ నోరెళ్లబెడుతున్నారు. దీనికి కారణం లేకపోలేదు. టెక్నాలజీ పెరగడంతో ప్రతీ దానికి టైమ్ ఎక్కువ పడుతుంది. దీంతో ప్రతీ సినిమా అనుకున్న టైమ్ కు రావడమే గగనమైపోతుంది. అలాంటిది పీపుల్ మీడియా బ్యానర్ నిర్మాత టి.జి విశ్వప్రసాద్ తమ బ్యానర్ నుంచి ఈ ఏడాది మినిమం 15 సినిమాలొస్తాయని ఇంత కాన్ఫిడెంట్ గా చెప్పడం చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. ఓ వైపు సినిమా షూటింగ్లతో బిజీగా ఉంటూనే మరో 20 స్క్రిప్ట్ వర్క్స్ జరుగుతున్నాయంటే ఈ బ్యానర్ ప్లానింగ్ మామూలుగా లేదు.













