నాపై 139 మంది అత్యాచారం చేయలేదు. ఒక వ్యక్తి బెదిరింపులకు లొంగి అలా కంప్లైంట్ ఇచ్చాను
నాపై 139 మంది అత్యాచారం చేయలేదు.. అతని ఒత్తిడి మేరకే !అవునూ.. మీరు విన్నది నేను అన్నది నిజమే. గత వారం రోజులుగా సోషల్ మీడియా లో ఒకే న్యూస్ బాగా వైరల్ అవుతూ వస్తోంది. అదేంటంటే.. ఓ యువతి తెలుగు టెలివిజన్, సినీ ఇండస్ట్రీకి సంబంధించి 139 మంది తనపై అత్యాచారానికి పాల్పడ్డారని కేసు పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే తాజాగా మీడియాతో మాట్లాడిన ఆమె “తనపై 139 మంది అత్యాచారం చేశారంటూ పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేశానని” బాధిత యువతి వెల్లడించారు. ఒక వ్యక్తి సూచన మేరకే కేసు పెట్టినట్టు చెప్పారు. అయితే అసలు మీడియాతో మాట్లాడిన యువతి ఏం చెప్పింది? అయితే తనతో తప్పుడు కేసులు పెట్టించిన అతను ఎవరు? అనే విషయాలు తెలుసుకుందాం..ఇక అసలు వివరాల్లోకి వెళితే.. గత వారం రోజుల క్రితం ఓ యువతి తనను గత ఆరేడు సంవత్సరాలుగా తెలుగు టెలివిజన్, సినీ ఇండస్ట్రీకి సంబంధించి 139 మంది అత్యాచారానికి పాల్పడుతున్నారని కేసు పెట్టడం కలకలం రేపింది. అయితే తాజాగా మీడియాతో మాట్లాడిన యువతి సంచలన వ్యాఖ్యలు చేసింది. అవేంటంటే.. “తనపై 139 మంది అత్యాచారం చేశారంటూ పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేశానని బాధిత యువతి వెల్లడించారు. టీవీ వ్యాఖ్యాత ప్రదీప్, నటుడు కృష్టుడుకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని” ఆమె స్పష్టం చేశారు.
అయితే హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దళిత, గిరిజన సంఘాల ప్రతినిధులతో కలిసి ఆమె మాట్లాడారు. తాను తప్పుడు కేసులు పెట్టిన వారికి క్షమాపణలు చెబుతున్నానని చెప్పారు. అయితే ఓ వ్యక్తి ఒత్తిడి మేరకే తాను ఫిర్యాదు చేశానని యువతి వెల్లడించారు. ఉద్యోగం పేరుతో డాలర్ బాయ్ అలియాస్ శ్రీకర్‌రెడ్డి తనను మోసం చేశాడని, చిత్రహింసలకు గురిచేశాడని ఆమె వివరించారు. అతని సూచన మేరకే కేసు పెట్టినట్టు చెప్పారు. శ్రీకర్‌రెడ్డి తనపై పలు మార్లు అత్యాచారం చేశాడని, తాను చెప్పినట్లు చేయకపోతే చంపేస్తానని బెదిరించాడని ఆమె వివరించారు. అలాంటి పరిస్థితుల్లోనే కేసు పెట్టాల్సి వచ్చిందని చెప్పారు.













