చందమామే… రేపు రాబోతోంది
నందమూరి కల్యాణ్‌రామ్ కథానాయకుడిగా నటిస్తున్న స్టైలిష్ యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ 118. నివేదా థామస్, షాలిని పాండే హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.వి.గుహన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మహేశ్ కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 1న విడుదల కానుంది. అయితే ఈ చిత్రంలోని మొదటి పాట చందమామే రేపు విడుదల కానుందని ఫిల్మ్‌మేకర్స్ ప్రకటించారు. ఇక కల్యాణ్‌రామ్ ఇప్పటివరకు చేయనటువంటి జోనర్ మూవీ ఇది. వెంకట్, అన్బరివు, రియల్ సతీష్‌ల అద్భుతమైన యాక్షన్ పార్ట్ సినిమాలో చాలా కీలకంగా ఉంటుంది. ఈ చిత్రానికి సంగీతం: శేఖర్ చంద్ర, మాటలు: మిర్చి కిరణ్, ఆర్ట్: కిరణ్ కుమార్, ఎడిటర్: తమ్మిరాజు.













