101 జిల్లాల అందగాడు వస్తున్నాడు
నటుడిగా, దర్శకుడిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న అవసరాల శ్రీనివాస్ హీరోగా నటించిన తాజా చిత్రం 101 జిల్లాల అందగాడు. రాచకొండ విద్యాసాగర్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రుహానీ శర్మ హీరోయిన్. దిల్ రాజు, డైరెక్టర్ క్రిష్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్స్, ఎస్వీసీ-ఎఫ్ఈఈ పతాకాలపై శిరీష్. రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్ల మూడి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న రిలీజ్ కానుంది. హిలేరియస్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. బట్టతల యువకుడు గొత్తి సత్యనారాయణగా అవసరాల నటించారు. శక్తికాంత్ కార్తీక్ సంగీతం అందించిన ఈ సినిమా టైటిల్ సాంగ్తో పాటు మనసా వినవా.. అనే లిరికల్ పాటకు కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా:రామ్.













