రంగమ్మా… మంగమ్మా రికార్డు
రామ్‌చరణ్, సమంత జంటగా నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం రంగస్థలం. ఈ చిత్రంలోని రంగమ్మా మంగమా పాట యూట్యూబ్‌లో రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు ఈ పాటను 100 మిలియన్లు (10 కోట్లు) మందికిపైగా వీక్షించారు. ఈ ఏడాదిలో అతి తక్కువ సమయంలో పది కోట్ల మార్క్‌ను దాటిన తొలి దక్షిణాది పాటగా రికార్డు సృష్టించినట్లు చిత్రవర్గాలు సోషల్‌మీడియా ద్వారా వెల్లడించాయి. ప్రముఖ యాంకర్ అనసూయ ఈ చిత్రంలో రంగమ్మత్తగా కీలక పాత్ర పోషించారు. సుకుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇందులో రామ్‌చరణ్ చిట్టిబాబు పాత్రలో, సమంత రామలక్ష్మి పాత్రల్లో నటించారు. మార్చిలో విడుదలైన ఈ చిత్రం మూడు రోజుల్లోనే రూ.100 కోట్లు రాబట్టింది.













