కల్కి కౌంట్ డౌన్ స్టార్ట్స్
ప్రభాస్ ఫ్యాన్స్ ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కల్కి 2898ఏడి మరో పది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ఏడాది హనుమాను తర్వాత బాక్సాఫీస్ కు ఊరటనిచ్చే సినిమా రాలేదని ఎదురుచూస్తున్న బయ్యర్లకు, ఆడియన్స్ కు కల్కి సినిమా మీద ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. కల్కి పోస్ట్ ప్రొడక్షన్స్ లో టీమ్ చాలా బిజీగా ఉంది.
ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఏర్పాట్లు, సెన్సార్ కోసం ఫైనల్ కాపీని రెడీ చేయడం, రీ రికార్డింగ్ కు సంబంధించిన ప్యాచ్ వర్క్, మీడియా కోసం ఇంటర్వ్యూలు, టికెట్ రేట్ల కోసం ప్రభుత్వాలకు విన్నపాలు పంపడంలో చాలా బిజీగా ఉన్నారు నిర్మాతలు. ఇప్పటికే హైప్ బాగా వచ్చింది. ఓపెనింగ్స్ నెక్ట్స్ లెవెల్ లో ఉంటాయని అర్థమవుతోంది.
ఇక బ్యాలెన్స్ ఏంటంటే సినిమా రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకోవడమే. త్రీడీ వెర్షన్ కూడా ఉంది కాబట్టి ఎక్కువ శాతం థియేటర్లలో దీన్నే ప్రదర్శించబోతున్నారు. పిల్లలు, పెద్దలు అందరినీ మెప్పించే స్థాయిలో కల్కిని రూపొందించాడు నాగ్ అశ్విన్. మొత్తానికి మరో పది రోజుల్లో కల్కి ని ఆడియన్స్ విట్నెస్ చేయబోతున్నారు. అర్థరాత్రి నుంచే రెండు తెలుగు రాష్ట్రాల్లో బెనిఫిట్ షోలు ఉంటాయని అందరూ ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మరి కల్కితో ప్రభాస్ ఈసారి ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడో చూడాలి.













