యూఎస్ ఎయిర్ పోర్ట్ లో తలైవా

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కొద్ది రోజుల క్రితం హిమాలయాలకి వెళ్ళిన సంగతి తెలిసిందే. సిమ్లా, రిషికేష్, ధర్మశాల తదితర ప్రాంతాలు సందర్శించి ఆ తర్వాత చెన్నై చేరుకున్నారు తలైవా. ఇక రీసెంట్‌గా అమెరికా వెళ్ళారు. రెగ్యులర్ హెల్త్ చెకప్ కోసం తన పెద్ద కూతురు ఐశ్వర్యతో రజనీ అమెరికా వెళ్ళినట్టు తెలుస్తుంది. యూఎస్ ఎయిర్‌పోర్టులో క్యాజువల్ డ్రెస్ ధరించి బ్లాక్ సన్‌గ్లాసెస్‌తో చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నారు రజనీకాంత్. మే రెండో వారం వరకు తలైవా అమెరికాలోనే ఉంటారని టాక్. యూఎస్ నుండి వచ్చిన తర్వాత కాలా చిత్ర ప్రమోషన్‌లో పాల్గొనడంతో పాటు తన పార్టీకి సంబంధించిన పనులు వేగవంతం చేయనున్నారు.