యూనివర్సల్ స్టూడియోలో ‘అజ్ఞాతవాసి’

పవన్‌కళ్యాణ్ నటించిన తాజా చిత్రం అజ్ఞాతవాసి చిత్రం మరో ఘనత సాధించబోతోంది. అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లోని యూనివర్శల్ స్టూడియోస్‌లో ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారట. అక్కడి సిటీ వాక్ థియేటర్స్‌లో ప్రదర్శించబోయే తొలి భారతీయ చిత్రం ఇదే కావడం విశేషం. ఈ విషయానికి సంబంధించిన పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2018 జనవరి 9న ఈ చిత్రాన్ని సిటీ వాక్ థియేటర్స్‌లో ప్రదర్శించనున్నట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్, కీర్తి సురేశ్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలోని పాటలు, టీజర్ మంచి టాక్ అందుకున్నాయి. ఆది పినిశెట్టి, బొమన్ ఇరానీ, ఖుష్భూ, రావు రమేశ్, మురళీ శర్మ, వెన్నెల కిశోర్ ఈ చిత్రంలో సహాయ నటులుగా నటించారు. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి స్వరాలు అందించారు. హారిక-హాసిని క్రియేషన్ సంస్థ నిర్మిస్తోంది. సంక్రాంతికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.