నాని సినిమాకు ఎన్నారైల ప్రశంసలు

నేచురల్ స్టార్ నాని నిర్మాతగా కాజల్ అగర్వాల్, నిత్యామీనన్, రెజీనా, అవసరాల శ్రీనివాస్ ప్రధాన తారాగణంగా రూపుదిద్దుకున్న అ..!??సినిమా అమెరికాలో మంచి రెస్పాన్స్‌ను అందుకుంది. నాని నిర్మాతగా వ్యహరించిన ఈ మొదటి సినిమా ఇటీవలనే విడుదలైంది. సినిమాకు రెండు తెలుగురాష్ట్రాలతోపాటు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ప్రతిచోటా మంచి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అ..! సినిమాను నిర్వాణ సినిమాస్ అమెరికాలో డిస్ట్రిబ్యూట్ చేసింది. మొత్తం 112 స్క్రీన్లలో ఈ సినిమాను విడుదల చేశారు. ప్రీమియర్ షోల ద్వారా ఈ సినిమా మంచి కలెక్షన్లను రాబట్టింది.