జయరామ్ కోమటి నటించిన ‘జయదేవ్’ రిలీజ్ రేపే

అమెరికాలో కమ్యూనిటీ నాయకునిగా, ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న జయరామ్ కోమటి అతిధి పాత్రలో నటించిన జయదేవ్ సినిమా రేపు రిలీజ్ అవుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు కుమారుడు గంటా రవి ఈ చిత్రంలో హీరోగా నటించారు. జయరామ్ కోమటి ఈ చిత్రంలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా కొద్దిసేపు కనిపించనున్నారు. శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై కె. అశోక్‌కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి జయంత్ సి. పరాన్జీ దర్శకుడు.