Gurram Paapireddy: “గుర్రం పాపిరెడ్డి” మూవీలోని ప్రతి సీన్ ను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు – డైరెక్టర్ మురళీ మనోహర్
నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా “గుర్రం పాపిరెడ్డి”. ఈ చిత్రాన్ని డా. సంధ్య గోలీ సమర్పణలో ప్రొడ్యూసర్స్ వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మిస్తున్నారు. డార్క్ కామెడీ కథతో ఇప్పటి వరకు మనం తెరపై చూడని కాన్సెప్ట్‌తో దర్శకుడు మురళీ మనోహర్ రూపొందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న “గుర్రం పాపిరెడ్డి” సినిమా ఈ నెల 19న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో మూవీ హైలైట్స్ తెలిపారు డైరెక్టర్ మురళీ మనోహర్
– మా నేటివ్ ప్లేస్ హైదరాబాద్. చిన్నప్పుడు శివ, నాయకుడు లాంటి సినిమాలు చూసిన ప్రభావంతో సినిమా ఇండస్ట్రీ వైపు ఆకర్షితుడిని అయ్యాను. ఇక్కడ ఎంబీఏ పూర్తిచేశాక లండన్ వెళ్లాను. అక్కడి ఫిలిం ఇనిస్టిట్యూట్ లో కోర్స్ చేసి వార్నర్ బ్రదర్స్ సంస్థలో ఎనిమిదేళ్లు వర్క్ చేశాను. ఆ తర్వాత ఇండియాకు తిరిగి వచ్చి డైరెక్టర్ సంపత్ నందితో వర్క్ చేయడం ప్రారంభించాను. ఆయన డైరెక్ట్ చేసిన చాలా మూవీస్ కు నేను వర్క్ చేశాను. 2010 నుంచి టాలీవుడ్ లో ఉన్నాను.
– సంపత్ నంది సపోర్ట్ తో సింబా మూవీ చేశాను. ఆ సినిమా నా ఫస్ట్ మూవీ. అయితే అది రిలీజ్ కావడంలో ఆలస్యమైంది. అప్పటికే గుర్రం పాపిరెడ్డి ప్రాజెక్ట్ కూడా ఫైనలైంది. సింబా రిలీజ్ ఆలస్యం వల్ల ప్రొడ్యూసర్స్ లో అనేక సందేహాలు ఉండేవి. ఫస్ట్ మూవీ ఎందుకు రిలీజ్ కాలేదు అని అనుకుంటారు కదా. కానీ చివరికి నా విజన్ ను నమ్మి గుర్రం పాపిరెడ్డి సినిమా చేయడానికి ప్రొడ్యూసర్స్ డిసైడ్ అయ్యారు. నాకు రెగ్యులర్ మూవీస్ చేయడం ఇష్టం ఉండదు. మీరు సింబా చూస్తే అది రొటీన్ కు భిన్నమైన మూవీ. నా ఫస్ట్ మూవీ సింబాతో చూస్తే గుర్రం పాపిరెడ్డి కంప్లీట్ గా డిఫరెంట్ సినిమా. నా తదుపరి సినిమాలు కూడా వేరు వేరే జానర్స్ లో చేస్తా.
– ఈ సినిమాకు పూర్ణ కథ అందించారు. మిగతా రైటర్స్, నేను స్క్రిప్ట్ సైడ్ వర్క్ చేశాం. గుర్రం పాపిరెడ్డి సినిమాకు ఫస్ట్ మేము అనుకున్న టైటిల్ పరమపదసోపానం. ఆ తర్వాత ఆ టైటిల్ అంతగా రీచ్ కాదనే ఆలోచనతో గుర్రం పాపిరెడ్డి అని పెట్టాం. మూవీలో నరేష్ అగస్త్య క్యారెక్టర్ పేరు అది. తెలివైనవారు, తెలివితక్కువ వారి మధ్య జరిగిన వార్ ఈ మూవీ కాన్సెప్ట్. తెలివైనవారు తెలివితక్కువ పనిచేసినా, తెలివితక్కువ వారు తెలివైన పనిచేసినా వారి జీవితాలు ఎలా మారుతాయి అనేది హ్యూమరస్ గా మా సినిమాలో తెరకెక్కించాం. మా సినిమాలో చాలా ఆర్గానిక్ కామెడీ ఉంటుంది. మనందరిలోనూ ఎంతో కొంత పిచ్చితనం ఉంటుంది. ఆ స్టుపిడిటీ నుంచి పుట్టే సహజమైన వినోదాన్ని తెరపైకి తీసుకొచ్చాం.
– కొందరు తమ తెలివి తక్కువ పనులతో ఇబ్బందులు పడుతుంటారు. వాళ్ల ఇబ్బందులు మనకు నవ్వు పుట్టిస్తాయి. నేనెప్పుడు హీరో సెంట్రిక్ గా సినిమా ఉండాలని అనుకోను. ఆ కథలో హీరో కూడా భాగంగా ఉండాలనుకుంటా. ఈ సినిమాకు హీరోగా ఎవర్ని తీసుకుందాం అనుకున్నప్పుడు కథలో ఇమిడిపోయేలా ఉండాలని నరేష్ అగస్త్యను తీసుకున్నాం. ఆయన గత సినిమాలు చూస్తే కథలో కలిసిపోయి చేశారు. నరేష్ అగస్త్యతో మాట్లాడిన తర్వాత ఈ పాత్రకు ఈయనే కరెక్ట్ అనే ఫీలింగ్ కలిగింది. నరేష్ అగస్త్య గుర్రం పాపిరెడ్డి పాత్రలో సహజంగా నటించాడు. జాతిరత్నాలు, మత్తువదలరా 2 వంటి మూవీస్ చూశాక మా మూవీలో హీరోయిన్ క్యారెక్టర్ కు ఫరియా అబ్దుల్లా బాగుంటుంది అనిపించి తీసుకున్నాం. ఆమె చాలా బాగా పర్ ఫార్మ్ చేసింది. అలాగే ఈ చిత్రంలో ఒక పాట కూడా తనే రాసి పాడి కొరియోగ్రఫ్ చేసింది.
– పైసా డుమ్ డుమ్ సాంగ్ సినిమాలో ఉంటుంది. మూవీలోని పాత్రలన్నీ ఒక ఫిక్షనల్ వరల్డ్ లోకి వెళ్తాయి. అక్కడ ఈ పాట వస్తుంది. మ్యూజిక్ డైరెక్టర్ కృష్ణ సౌరభ్ మంచి కంపోజిషన్ చేశాడు. మా మూవీలో బ్రహ్మానందం గారిది కీ రోల్. ఆయనతోనే మూవీ మొదలై ఆయనతోనే పూర్తవుతుంది. మా మూవీ కాన్సెప్ట్ చెప్పాక నచ్చి నేను చేస్తానని ముందుకొచ్చారు. అనుభవం ఉన్న నటుడు కాబట్టి ఈ పాత్రను అద్భుతంగా ఇంప్రువైజ్ చేసి నటించాడు. డబ్బింగ్ చెబుతున్నప్పుడు చాలా బాగా తెరకెక్కించావు అంటూ ప్రశంసించారు. ఈ సినిమా కోసం రోబొటిక్ ఆర్మ్ ఉండే కెమెరాను ఉపయోగించాం. ఆ కెమెరాతో రోజుకు మూడు నాలుగు సీన్స్ మాత్రమే చేయగలం. ఆ కెమెరాకు సరిపోయే సెటప్ అలా ఉంటుంది.
– మరో ఇంపార్టెంట్ రోల్ కు యోగి బాబు గారిని తీసుకున్నాం. ఆయన కథ విని చేస్తానని అన్నారు..అయితే డేట్స్ వెంటనే దొరకలేదు. 3 నెలల పాటు ఆయన డేట్స్ కోసం వేచి చూశాం. ఆ టైమ్ లో మిగతా మూవీకి సంబంధించిన వర్క్ చేసుకున్నాం. యోగి బాబు తమిళంలో క్రేజ్ ఉన్న నటుడు. తమిళంలోనూ సినిమా రిలీజ్ చేయొచ్చు కదా అని అడుగుతున్నారు. తమిళం నుంచి కొన్ని ఎంక్వైరీస్ కూడా జరిగాయి. అయితే తెలుగులో ప్రేక్షకులకు బాగా రీచ్ చేసిన తర్వాత మిగతా భాషల గురించి ఆలోచిస్తాం. నాకు పాన్ ఇండియా ట్రెండ్ మీద క్రేజ్ లేదు. తెలుగు సినిమాలు తెలుగులో బాగా ఆదరణ పొందితే, మిగతా భాషల్లోకి డిమాండ్ అదే వస్తుంది.
– మూవీ రెండున్నర గంటలు ఉంటుంది. అయితే ఎక్కడా మూవీ లెంగ్తీగా ఉన్నట్లు అనిపించదు. సీన్ టు సీన్ ఎంజాయ్ చేస్తారు. సరదాగా ఆడుతూ పాడుతూ సినిమా వెళ్తుంటుంది. ఒక్క సీన్ కూడా బోర్ కొట్టదు. అవతార్ రిలీజ్ రోజే మా సినిమా రిలీజ్ అవుతుంది. అయితే అది తెలిసిన ప్రపంచం, పైగా ఇంగ్లీష్ మూవీ. మనది తెలుగు సినిమా. మన తెలుగు సినిమాను ఆడియెన్స్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ప్రస్తుతం కొన్ని కథలు సిద్ధంగా ఉన్నాయి. నెక్ట్స్ ఒక మ్యూజికల్ రొమాంటిక్ మూవీతో పాటు కంప్లీట్ హారర్ థ్రిల్లర్ మూవీ చేయాలనుకుంటున్నా.






