Gurram Paapireddy: “గుర్రం పాపిరెడ్డి” సినిమా బలమైన కథా నేపథ్యంతో, ప్రతి సీన్ ఫన్ జోన్ లో వెళ్తూ నవ్విస్తుంది – నరేష్ అగస్త్య
నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా “గుర్రం పాపిరెడ్డి”. ఈ చిత్రాన్ని డా. సంధ్య గోలీ సమర్పణలో ప్రొడ్యూసర్స్ వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మిస్తున్నారు. డార్క్ కామెడీ కథతో ఇప్పటి వరకు మనం తెరపై చూడని కాన్సెప్ట్‌తో దర్శకుడు మురళీ మనోహర్ రూపొందిస్తున్నారు. “గుర్రం పాపిరెడ్డి” సినిమా ఈ నెల 19న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో సినిమా హైలైట్స్ తెలిపారు హీరో నరేష్ అగస్త్య.
– నేను ఇప్పటిదాకా ఇలాంటి మూవీ చేయలేదు. గతంలో నేను నటించిన చిత్రాల్లో నా క్యారెక్టర్స్ సెటిల్డ్ గా ఉంటాయి. “గుర్రం పాపిరెడ్డి”లో నా క్యారెక్టర్ కొంచెం ఎనర్జిటిక్ గా నేనే లీడ్ తీసుకునేలా ఉంటుంది. మా డైరెక్టర్ మురళీ మనోహర్ ఈ కథ చెప్పాక బాగా నచ్చింది. ఆ తర్వాత మేము ఈ ప్రాజెక్ట్ వర్క్స్ కోసం ఏడాది పాటు ట్రావెల్ చేశాం. రాజు వెడ్స్ రాంబాయి హీరోయిన్ తేజస్వినీ మా మూవీ ప్రమోషన్స్ లో “గుర్రం పాపిరెడ్డి” బదులు గేదెల పాపిరెడ్డి అని చెప్పింది. ఆమె చెప్పింది తప్పు టైటిల్ అయినా బాగా వైరల్ అయ్యింది. ఆమె వల్ల మా సినిమా ఇంకొంతమందికి తెలిసింది.
– ఈ చిత్రంలో నేనొక పని కోసం వస్తాను. ఆ పని చేసేందుకు నాకు తెలిసిన వాళ్లలో కొందరు తెలివిలేని వాళ్లు కావాలి. వాళ్లను సెలెక్ట్ చేసుకుంటా. వాళ్లు నన్ను ప్రశ్నించినా మ్యానేజ్ చేయగలిగిన వాళ్లనే సెలెక్ట్ చేసుకుంటా. నేను వచ్చిన పని ఏంటి అనేది ట్రైలర్ లో కూడా రివీల్ చేయలేదు. ఒక శవం కోసం వేట సాగిస్తుంటాం. ఆ శవం ఎవరిది, ఏంటి అనేది కథలోని మెయిన్ పాయింట్.
– తెలివైన వాడు తెలివితక్కువ పనిచేస్తే, తెలివి లేని వాళ్లు తెలివైన పనిచేస్తే వాళ్ల జీవితాల్లో వచ్చిన పరిణామాలు ఏంటి అనేది ఈ మూవీ స్టోరీ లైన్. డార్క్ కామెడీ మూవీస్ అనే జానర్ లో మనకు గతంలో మూవీస్ వచ్చాయి గానీ అవి డార్క్ కామెడీ అని ట్యాగ్ పెట్టలేదు. ఎవరైనా కొన్ని ఇబ్బందుల్లో ఉంటే వాడికి బాధ కానీ మనకు నవ్వొస్తుంది. అదే డార్క్ కామెడీ. ఈ మూవీలోని క్యారెక్టర్స్ ఇబ్బంది పడుతుంటే ఆ సందర్భాలు ప్రేక్షకులనేలా ఉంటాయి. సినిమా అంతా ఫన్ జోన్ లో వెళ్తుంటుంది. ఈ మూవీకి బలమైన కథ ఉంది. ప్రతి సీన్ కామెడీగా వెళ్తున్నా వెనక ఒక స్ట్రాంగ్ స్టోరీ రన్ అవుతుంటుంది. ఇంటర్వెల్ కు ఆడియెన్స్ షాక్ అవుతారు.
– ఈ సినిమాను మా ప్రొడ్యూసర్స్ కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. ముఖ్యంగా అమర్ గారు సినిమా అనుకున్న బడ్జెట్ పెరిగినా క్వాలిటీ తగ్గకుండా చూసుకున్నారు. యోగి బాబు గారి కోసం మేము వెయిట్ చేశాం. బ్రహ్మానందం గారితో నాకు కాంబినేషన్ సీన్స్ లేవు గానీ యోగి బాబు గారితో ఉన్నాయి. ఆయన ఎంతో ఫ్రెండ్లీగా ఉండేవారు. నన్ను బైక్ మీద రామోజీ ఫిలిం సిటీలో తిప్పారు. ఫొటో తీసుకుందాం రా నరేష్ అంటూ సెల్ఫీ తీసుకున్నారు. ఇవన్నీ తనకు మెమొరీస్ అని ఆయన చెప్పడం హ్యాపీగా అనిపించింది.
– ఎంత మంచి స్క్రిప్ట్ ఉన్నా దాన్ని పర్ ఫార్మ్ చేసే ఆర్టిస్టులు ఉండాలి. మా మూవీలో ఫరియా, రాజ్ కుమార్ కసిరెడ్డి,
వంశీధర్ మంచి కామెడీ టైమింగ్ తో నటించారు. వాళ్లతో కలిసి నటించడం నాకు కూడా ఒక మంచి ఎక్సిపీరియన్స్ ఇచ్చింది. మేమంతా ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో సీన్స్ గురించి డిస్కస్ చేసుకుని మేమంతా నటించేవాళ్లం. మా మూవీ కోసం కృష్ణ సౌరభ్ మంచి సాంగ్స్ ఇచ్చారు. ప్రమోషనల్ సాంగ్ కు కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది.
– ఒక మూవీ ట్రైలర్, టీజర్ తోనే జనాల్లోకి వెళ్లాలి. అక్కడి నుంచి ప్రేక్షకులే మూవీని తీసుకెళ్లాలి. గుర్రం పాపిరెడ్డి సినిమా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. నేను నటించాను కాబట్టి ట్రైలర్ ను జడ్జ్ చేయలేకపోతున్నా కానీ చూసిన వాళ్లంతా బాగుందని అంటున్నారు. మా మూవీకి వర్క్ చేసిన వాళ్లు సినిమా హిట్ అనే చెబుతున్నారు. రేపు ప్రీమియర్స్ వేస్తున్నాం. నేను కూడా ఫుల్ మూవీ ఇప్పటిదాకా చూడలేదు. మూవీ చూశాక మిగతా వాళ్లు ఇచ్చే రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తున్నా.
– నాకు ట్రావెలింగ్ ఇష్టం. అలాగే నేను ఫ్రీ డైవింగ్ చేస్తుంటా. అంటే ఒక్కసారి ఊపిరి పీల్చి సముద్రంలో ఎంత లోతు వెళ్లగలమో అంత లోతు వెళ్లాలి. నేను సముద్రంలో 3 నిమిషాల 40 సెకండ్స్ 80 ఫీట్స్ డెప్త్ వెళ్లాను.
– నా దృష్టిలో కమర్షియల్ సినిమా అంటే ఆ మూవీలో పాటలు ఫైట్స్ లేకున్నా ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేయగలిగేది. సెన్సబుల్ ఎలిమెంట్స్ ఉంటూ ప్రేక్షకులకు నచ్చేలా ఉన్న సినిమా. నేను ఇప్పటిదాకా చేసిన సినిమాల్లో పక్కా కమర్షియల్ మూవీ లేదు. అలాంటి మూవీ ఉంటే ఆడియెన్స్ కు మరింతగా రీచ్ అయ్యే అవకాశాలు ఉండేవి. నేను వచ్చే ఏడాది అలాంటి మూవీ ఒకటి చేయబోతున్నా. ఆ సినిమా మీద నాకు చాలా హోప్స్ పెట్టుకున్నా. ఆ సినిమా 70 శాతం షూటింగ్ కంప్లీట్ చేశాం. కొత్త తరహా మూవీస్ చేయాలనేది నా కోరిక. సహారా ఎడారిలో ఆ మూవీ షూటింగ్ చేయడం కొత్త అనుభవం ఇచ్చింది. నేను చేసిన ప్రాజెక్ట్స్ వికటకవి, సేనాపతి వంటివి ఎక్కువగా ఓటీటీలోనే రీచ్ అయ్యాయి. నేను ఇప్పటిదాకా చేసిన ప్రాజెక్ట్స్ కు పెద్దగా ప్రమోషన్ లేక ఆడియెన్స్ దాకా వెళ్లలేదేమో. గుర్రం పాపిరెడ్డి సినిమాకు చేసినంత ప్రమోషన్ నేను గతంలో ఏ సినిమాకు చేయలేదు.






