Gurram Papi Reddy: కామెడీతో “గుర్రం పాపిరెడ్డి” సినిమా ప్రేక్షకుల్ని బాగా నవ్విస్తుంది – ప్రొడ్యూసర్స్
నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా “గుర్రం పాపిరెడ్డి” (Gurram Papi Reddy). ఈ చిత్రాన్ని డా. సంధ్య గోలీ సమర్పణలో ప్రొడ్యూసర్స్ వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మిస్తున్నారు. డార్క్ కామెడీ కథతో ఇప్పటి వరకు మనం తెరపై చూడని కాన్సెప్ట్‌తో దర్శకుడు మురళీ మనోహర్ రూపొందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న “గుర్రం పాపిరెడ్డి” సినిమా ఈ నెల 19న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో మూవీ హైలైట్స్ తెలిపారు ప్రొడ్యూసర్స్ జయకాంత్(బాబీ), అమర్ బురా.
ప్రొడ్యూసర్ జయకాంత్ (బాబీ) మాట్లాడుతూ
– డైరెక్టర్ మురళీ మనోహర్ మా ఫ్రెండ్. ఆయన “గుర్రం పాపిరెడ్డి” స్టోరీ మాకు నెరేట్ చేశాడు. కథ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ప్రొడక్షన్ స్టార్ట్ చేసేందుకు ఇలాంటి కొత్త తరహా కథ కరెక్ట్ అనుకుని మూవీ స్టార్ట్ చేశాం. కొత్త ప్రొడ్యూసర్స్ అంటే ఏదైనా లవ్ స్టోరీతో, యూత్ ఫుల్ కంటెంట్ తో చేస్తుంటారు. కానీ రొటీన్ ప్రాజెక్ట్ చేయొద్దనే డార్క్ కామెడీ జానర్ లో ” సినిమాను నిర్మించాం.
– ఈ కథ విని తరుణ్ భాస్కర్ నేను లీడ్ చేస్తానని అన్నారు. అయితే ఆయనకు అప్పటికే కమిట్ అయిన ప్రాజెక్ట్స్ ఉండటం వల్ల డిలే అవుతూ వచ్చింది. మరో యంగ్ హీరోకు కూడా సబ్జెక్ట్ నచ్చింది. అతను ఆన్ బోర్డ్ రావడానికి కూడా లేట్ అయ్యింది. చైతన్య జొన్నలగడ్డ కూడా మా మూవీలో ఒక ఇంపార్టెంట్ రోల్ కు ఓకే చెప్పాడు. నరేష్ అగస్త్య బాగుంటాడని ఆయనకు స్క్రిప్ట్ చెప్పాం. నరేష్ కూడా ఆసక్తి చూపించాడు. అతనితో ఇంటరాక్ట్ అయ్యాక మా డైరెక్టర్ మురళీ మనోహర్ కు కూడా నరేష్ ఆగస్త్య ఈ కథకు యాప్ట్ అని చెప్పాడు. నరేష్ మత్తువదలరా వంటి డిఫరెంట్ కాన్సెప్ట్స్ మూవీస్ చేసి ఉన్నాడు. అతను “గుర్రం పాపిరెడ్డి” టైటిల్ క్యారెక్టర్ లో బాగా నటించాడు.
– ఫరియా అబ్దుల్లాకు మంచి కామెడీ టైమింగ్ ఉంది. ఆమె జాతిరత్నాలు సినిమాలో చిట్టి క్యారెక్టర్ ట్రెడిషనల్ గా ఉంటుంది. ఆ పాత్రతో చూస్తే మా “గుర్రం పాపిరెడ్డి” మూవీలో ఆమె చేసిన సౌధామిని క్యారెక్టర్ కంప్లీట్ డిఫరెంట్ గా ఉంటుంది. తన రోల్ చేయడమే కాదు ఒక సాంగ్ రాసి పాడి కొరియోగ్రాఫ్ చేసింది. ఆ పాట వైరల్ గా మారుతోంది. బ్రహ్మానందం, యోగి బాబు కీ రోల్స్ చేశారు. బ్రహ్మానందం గారు డబ్బింగ్ చెబుతున్న టైమ్ లో సినిమాలో పెద్ద క్యారెక్టర్ చేయించారు అన్నారు. ఆయన ఇటీవల కాలంలో ఇంత లెంగ్తీ రోల్ చేయలేదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆయన క్యారెక్టర్ ఉంటుంది. అలాగే యోగి బాబు గారి కోసం రెండు నెలలు వెయిట్ చేశాం. రాజ్ కుమార్ కాసిరెడ్డి, వంశీధర్ కోసిగి మధ్య హిలేరియస్ కామెడీ వర్కవుట్ అయ్యింది. వాళ్లిద్దరికీ ఈ సినిమా ఫేమ్ తీసుకొస్తుంది.
– క్యారెక్టర్స్ కు తగిన ఆర్టిస్టులనే తీసుకోవాలని అనుకున్నాం. దాంతో సినిమా బడ్జెట్ అనుకున్నదాని కంటే ఎక్కువైంది. అప్పుడు యూఎస్ లో ఉండే మా మిత్రులు వేణు, డా. సంధ్య గారు ప్రొడక్షన్ లో భాగమయ్యారు. బిజినెస్ పరంగా కూడా జాగ్రత్తగా ఉన్నాం. మాకు నచ్చిన ప్రైస్ వస్తేనే డీల్ చేస్తున్నాం. మా మూవీ కంటెంట్ మీద పూర్తి నమ్మకంతో ఉన్నాం, మూవీ సక్సెస్ అవుతుందనే నమ్ముతున్నాం.
ప్రొడ్యూసర్ అమర్ బురా మాట్లాడుతూ
తెలివిలేని వాళ్లు తెలివైన వాడిని ఎలా ఎదుర్కొన్నారు అనేది మా మూవీ పాయింట్. ఫన్, కామెడీతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. సందేశాలు వినేందుకు ప్రేక్షకులు థియేటర్స్ కు రారు. వాళ్లను ఆ కాసేపు ఎంటర్ టైన్ చేయాలి. మా మూవీ కంటెంట్ మీద పూర్తి నమ్మకంతో ఉన్నాం. మ్యాడ్, మ్యాడ్ 2 చూస్తున్నప్పుడు ఆ పాత్రలను చూస్తేనే ఎలా నవ్వుకున్నామో మా సినిమాలోనూ ఆర్టిస్టులను చూడగానే ఫన్ గా ఫీలవుతారు. నరేష్ అగస్త్యకు మత్తువదలరా థియేట్రికల్ గా మంచి పేరు తెచ్చింది. గుర్రం పాపిరెడ్డి సినిమా థియేట్రికల్ రిలీజ్ పరంగా ఆయనకు మరింత రేంజ్ తెస్తుందని నమ్ముతున్నాం.
– సినిమా మేకింగ్ అంటే ప్రతి రోజూ ఒక ఛాలెంజ్. మా మూవీకి కొంత బడ్జెట్ పెరిగింది. అందుకు కథ స్పాన్ తో పాటు స్ట్రైక్ ఎఫెక్ట్ కూడా పడింది. ఇక్కడ స్ట్రైక్ జరుగుతున్నప్పుడు మైసూర్ వెళ్లి షూట్ చేశాం. సినిమా బిజినెస్ చేయడం మామూలు విషయం కాదు. మా మూవీ కంటెంట్ ప్రతి ఒక్కరికీ నచ్చినా స్టార్ హీరో లేడు అనేది బిజినెస్ పరంగా ఇబ్బంది అయ్యింది. కంటెంట్ ను నమ్మి మా గుర్రం పాపిరెడ్డి సినిమాను 140 స్క్రీన్స్ లో రిలీజ్ చేస్తున్నాం. ముందే పెద్ద సంఖ్యలో థియేటర్స్ వేసి సినిమాకు జనం లేరు అనిపించుకోవడం కంటే రెస్పాన్స్ బాగుంటే పెంచుకోవచ్చు అని అనుకున్నాం. టికెట్ ప్రైస్ కూడా అందుబాటులో ఉండేలా చూసుకుంటున్నాం.
– మా మూవీ ప్రేక్షకుల ఆదరణ పొందుతుందని ఆశిస్తున్నాం. అవతార్ సినిమాతో పాటే మా సినిమాను రిలీజ్ చేస్తున్నాం. అవతార్ సినిమాకు ఉండే ఆడియెన్స్ ఆ సినిమాకు ఉంటే మా మూవీకు ఉండే ఆడియెన్స్ మాకు ఉంటారని అనుకుంటున్నాం. ప్రొడ్యూసర్స్ గా మేమంతా ఒక టీమ్ గా కుదిరాం. కలిసే ఇకపై మూవీస్ చేయాలని అనుకుంటున్నాం.






