యూఎస్ ఓపెన్ కు మరో స్టార్ ప్లేయర్ దూరం

యుఎస్ ఓపెన్‍కు దూరమైన స్టార్ క్రీడాకారుల జాబితాలో సిమోనా హలెప్ (రొమేనియా) కూడా చేరింది. తాజాగా ప్రేగ్ ఓపెన్‍ను గెలిచి ఫామ్ నిరూపించుకున్న హలెప్.. యూఎస్ ఓపెన్ ఆడుతుందని భావించినా అనూహ్యంగా తప్పుకుంది. టెన్నిస్ కంటే ఆరోగ్యానికే ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆమె తెలిపింది. ప్రస్తుతం మనం ఉన్న కరోనా అసాధారణ పరిస్థితులను అంచనా వేసుకుని న్యూయార్క్లో జరిగే యుఎస్ ఓపెన్‍లో ఆడకూడడదని నిర్ణయించుకున్నా. ఆరోగ్యానికే నా తొలి ప్రాధాన్యం. అందుకే ఐరోపాలోనే ఉండి ఇక్కడే శిక్షణ కొనసాగించాలని భావించా అని వింబుల్డన్ మాజీ ఛాంపియన్ ట్విటర్‍లో తెలిపింది.