యూఎస్ ఓపెన్ కు ముగురుజా దూరం?

స్పెయిన్‍కు చెందిన టెన్నిస్ స్టార్ గార్బినె ముగురుజా ఈ ఏడాది చివరి గ్రాండ్‍స్లామ్ యూఎస్ ఓపెన్‍లో ఆడే అవకాశాలు లేవని తెలుస్తోంది. మోకాలి గాయం కారణంగా ఆమె ప్రస్తుతం వెస్ట్రన్ అండ్ సదరన్ ఓపెన్‍కు దూరమైంది. ఈ నేపథ్యంలో యూఎస్ ఓపెన్ లోనూ తాను ఆడకపోవచ్చని ముగురుజా తెలిపింది.