యుఎస్ ఓపెన్ బరిలో కిమ్ క్లియ్‍స్టర్స్

టెన్నిస్‍కు వీడ్కోలు పలికి ఏడేళ్ల తర్వాత పునరాగమనం చేసిన ప్రపంచ మాజీ నెం.1 కిమ్ క్లియ్‍స్టర్స్ యుఎస్ ఓపెన్ బరిలో దిగనుంది. సింగిల్స్, డబుల్స్లో ఆమెకు వైల్డ్ కార్డు లభించింది. హెయిలీ బాప్టిస్టెతో కలిసి ఆమె డబుల్స్ విభాగంలో ఆడనుంది. పునరాగమనం తర్వాత క్లియ్‍స్టర్స్కు ఇదే తొలి గ్రాండ్‍స్లామ్ టోర్నీ. మూడుసార్లు యుఎస్ ఓపెన్ గెలుచుకున్న ఈ బెల్జియం స్టార్ ఈ ఏడాది ఫిబ్రవరిలో రిటైర్మెంట్ నుంచి వెనక్కి వచ్చిన సంగతి తెలిసిందే.