యూఎస్ ఓపెన్ నుంచి మరో స్టార్ అవుట్…

త్వరలో జరిగే యూఎస్ ఓపెన్ నుంచి మరో స్టార్ తప్పుకొంది. స్విట్జర్లాండ్‍కు చెందిన ప్రపంచ 8వ ర్యాంకర్ బెలిండా బిన్‍సిచ్ ఈ మెగా టోర్నీలో ఆడడం లేదని ప్రకటించింది. ఈ నెలాఖరులో మొదలయ్యే యూఎస్ ఓపెన్ నుంచి ఇప్పటికే మహిళల డిఫెండింగ్ చాంపియన్ బియాంకా, పురుషుల స్టార్ నడాల్, కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో తాము టోర్నీ నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.