భారతీయుల ‘స్మార్ట్’ మాస్టర్ మైండ్.. షాపింగ్ స్టైల్ మార్చేసిన జనం..!
ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితులు కొనసాగుతున్న వేళ భారతీయ వినియోగదారుల ఆలోచనా విధానం (Indian Shopping) పూర్తిగా మారిపోయింది. చేతిలో డబ్బులు ఉన్నా సరే గుడ్డిగా ఖర్చు చేసే ట్రెండ్‌కు జనం స్వస్తి పలుకుతున్నారు. ఏది పడితే అది కొనకుండా, ఆచి తూచి అడుగులేస్తున్నారు. ప్రముఖ సంస్థ ‘డెలాయిట్’ (Deloitte) తాజాగా విడుదల చేసిన ‘కన్స్యూమర్ సిగ్నల్స్ ఇండియా’ నివేదికలో భారతీయుల షాపింగ్ పద్ధతులపై ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి.
ఖర్చు ఆపలేదు.. కానీ ‘స్మార్ట్’ అయ్యారు!
ప్రజలు ఖర్చు చేయడమేమీ (Indian Shopping) ఆపేయలేదు, కానీ బడ్జెట్‌ను ఎక్కడ, ఎలా వాడాలో ఒక పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తున్నారు. దీనినే ‘స్మార్ట్ స్పెండింగ్’ (Smart Spending) అని ఈ నివేదిక అభివర్ణించింది. నిత్యావసరాలకు పెద్దపీట వేస్తూనే.. విలాసవంతమైన, భారీ కొనుగోళ్లను ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నారు. ఒక వస్తువు కొనే ముందు కేవలం ధరనే కాకుండా.. దాని నాణ్యత, బ్రాండ్‌పై ఉన్న నమ్మకం, దీర్ఘకాలంలో అది ఎంతవరకు ఉపయోగపడుతుంది? అనే లెక్కలు పక్కాగా వేసుకుంటున్నారు.
కిరాణా సరుకుల్లో వృథాకు చెక్
ఆహారం విషయంలో కూడా జనం చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు. కిరాణా ఖర్చులను నియంత్రిస్తూనే, నాణ్యతలో మాత్రం అస్సలు రాజీ పడటం లేదు. వస్తువు చౌకగా వచ్చిందని ఏది పడితే అది బుట్టలో వేసుకోవడం లేదు. పెట్టిన ప్రతి రూపాయికి (Indian Shopping) పూర్తి విలువ వచ్చే వస్తువులనే ఎంచుకుంటున్నారు. సర్వే ప్రకారం ఏకంగా 31 శాతం మంది వినియోగదారులు ఇంట్లో ఆహార వృథాను అరికట్టేందుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుండటం విశేషం.
ఇవి కూడా చదవండి
తక్కువ తిరిగినా.. ‘రాయల్’ ఎక్స్పీరియన్స్
ప్రయాణాలు, టూరిజం విషయంలో ఒక విచిత్రమైన ట్రెండ్ కనిపిస్తోంది. టూర్లకు వెళ్లే వారి సంఖ్య కాస్త తగ్గినప్పటికీ.. వెళ్లే కొద్దిమంది మాత్రం తమ జర్నీ అత్యంత సౌకర్యవంతంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఎక్కువ సార్లు సాధారణ ప్రయాణాలు (Indian Shopping) చేసే బదులు.. తక్కువ సార్లయినా ఫుల్-సర్వీస్ ఎయిర్‌లైన్స్, ప్రీమియం సీట్లు, ఫైవ్ స్టార్ హోటళ్లలో బస చేసేందుకే ఓటు వేస్తున్నారు. ముఖ్యంగా పట్టణాల్లోని మధ్య, ఉన్నత ఆదాయ వర్గాల్లో బెస్ట్ ఎక్స్పీరియన్స్ కోసం ఖర్చు చేసే ఈ ట్రెండ్ స్పష్టంగా కనిపిస్తోంది.
కార్ల కాదు.. ఈవీల వైపు చూపు
ఆటోమొబైల్ రంగంలో కొనుగోలుదారులు మరింత జాగ్రత్త పడుతున్నారు. ప్రస్తుతానికి కొత్త కారు కొనే ఆలోచనను విరమించుకుని, ఇంట్లో ఉన్న పాత వాహనంతోనే (Indian Shopping) నెట్టుకొస్తున్నారు. అయితే ఒకవేళ భవిష్యత్తులో వాహనం కొనాల్సి వస్తే మాత్రం ఎలక్ట్రిక్ వాహనాల (EVs) వైపే మొగ్గు చూపుతున్నారు. తక్కువ నిర్వహణ ఖర్చు, అత్యాధునిక టెక్నాలజీ, పర్యావరణ హితం వంటి అంశాలు ఈవీల వైపు ఆకర్షితులు అయ్యేలా చేస్తున్నాయి.
మొత్తంగా చూస్తే.. భారతీయులు తమ కోరికలను చంపుకోకుండా, ఆర్థిక క్రమశిక్షణతో బ్యాలెన్స్ చేసుకుంటూ జీవన ప్రమాణాలను పెంచుకునేలా తెలివిగా ఖర్చు (Indian Shopping) చేస్తున్నారు. “ఎంత ఖర్చు చేశాం” అన్నదానికంటే “ఎక్కడ, దేనికోసం ఖర్చు చేశాం” అన్నదే ఇప్పుడు సగటు భారతీయుడి తారకమంత్రంగా మారిందని డెలాయిట్ నివేదిక స్పష్టం చేస్తోంది.
ఇవి కూడా చదవండి






