మీ పిల్లలకు తెలుగు నేర్పండి : యార్లగడ్డ
విశ్వగురువుగా భాసిల్లిన భారతదేశం అన్ని రంగాల్లో అగ్రగామిగా దూసుకోపోతోందని, అందులో ప్రవాస భారతీయుల భాగస్వామ్యం అత్యంత కీలకమైనదని ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కొనియాడారు. భవన నిర్మాణం, వ్వవసాయం, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులలో అగ్రగామిగా ఉన్న ప్రవాస భారతీయులు తమ సత్ప్రవర్తనతో ఉగాండా వాసుల మనసులు గెలుచుకోవాలని ఆయన సూచించారు. ఉగాండా రాజధాని కంపాలలో జరిగిన సనాతన ధర్మ మండలి, ఉగాండా తెలుగు ప్రజల సమావేశాలలో యార్లగడ్డ పాల్గొని ప్రసంగించారు. కంపాలాలోని సిల్వర్ స్ప్రింగ్స్ హోటల్లో జరిగిన సమావేశానికి పెద్ద ఎత్తున హాజరైన తెలుగు వారిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రవాసాంధ్రులు, సిలికాన్ ఆంధ్ర నిర్వహిస్తున్న మన బడి, తానా నడుపుతున్న పాఠశాలల ద్వారా పిల్లలకు తెలుగు నేర్పించాలని ఆయన సూచించారు.













