సంచలన వ్యాఖ్యలు చేసిన స్మృతి ఇరానీ
ప్రధాని నరేంద్ర మోదీ రాజకీయాల నుంచి తప్పుకున్న మరుక్షణం తాను కూడా తప్పుకుంటానని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పుణెలో ఆమె మీడియాతో మాట్లాడుతూ దివంగత నేత అటల్ బిహారీ వాజ్పేయి, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వలో పని చేసే అవకాశం లభించినందుకు సంతోషంగా, గర్వంగా ఉందని అన్నారు. భవిష్యత్తులో ప్రధాని కావాలన్న కోరికైతే తనకు లేదని అన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని, ప్రధానిగా మోదీ మరోమారు ప్రమాణ స్వీకారం చేస్తారని జోస్యం చేప్పారు. వచ్చే ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలనే విషయాన్ని బీజేపీ అధిష్ఠానం నిర్ణయిస్తుందన్నారు. గత ఎన్నికల్లో అమేథీ ప్రజలు తనను గుర్తించలేకపోయారని, కానీ ఇప్పుడు తనను గుర్తు పడుతున్నారని పేర్కొన్నారు. మంత్రి సుష్మా స్వరాజ్, స్వీకర్ సుమిత్రా మహాజన్లే తనకు రాజీకీయాల్లో స్ఫూర్తి అని తెలిపారు.













