పిల్లల పేర్లు కరోనా, లాక్డౌన్
కరోనా వైరస్‌తో కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ సమయంలో ప్రసవించిన ఎందరో తల్లులు తమ బిడ్డలకు కరోనా, లాక్ డౌన్ అనే పేర్లు పెడుతున్నారు. దొయిరా జిల్లాలోని కుకుండు గ్రామంలో ఓ మాతృమూర్తి లాక్ డౌన్ సమయంలో పండంటి బాబుకు జన్మనిచ్చింది. ఆ బాబుకు ‘లాక్ డౌన్’ అని పేరు పెట్టారు. దీనిపై ఆ బాబు తండ్రి తమకు లాక్ డౌన్ కాలంలో బాబు జన్మించాడనీ, కరోనా మహమ్మారి నుంచి దేశ ప్రజలను కాపాడేందుకు ప్రధాని నరేంద్ర మోడీ దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించారనీ, జాతి ప్రయోజనాల కోసం ఆయన తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూతమ బాబుకు లాక్ డౌన్ అని పేరు పెట్టామనీ చెప్పారు. అలాగే ఘోరక్ పూర్ జిల్లాలో నివాసం ఉంటున్న మహిళ జనతా కర్ఫ్యూ సమయంలో తనకు పుట్టిన బిడ్డకు కరోనా అని పేరు పెట్టుకుంది. తన బిడ్డ పేరు విన్న వారంతా మహామ్మారి కరోనా నుంచి బయటపడటానికి చైతన్య వంతులవ్వాలన్న ఉద్దేశంతో ఆ పేరు పెట్టానని ఆమె చెప్పింది.













