ఏపీలో 11 తెలంగాణలో 7 ఎంపిక
పాస్‌పోర్టు సేవా కేంద్రాలుగా ప్రధాన తపాలా కార్యాలయాలను వినియోగించుకోవాలని విదేశీ వ్యవహరాల మంత్రిత్వశాఖ నిర్ణయించింది. తపాలా కార్యాలయం ద్వారా పాస్‌పోర్టులను పౌరులకు అందించనున్నారు. పాస్‌పోర్టు సేవలను విస్తృతపరిచి ప్రజల సౌకర్యార్థం అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మొదటి రెండు దశల్లో 251 పోస్టాఫీసు పాస్‌పోర్టు సేవా కేంద్రానలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించగా, ఇందులో ఇప్పఇకే 192 పోస్టాఫీసులు ఈ నెల 14 నుంచి సేవలు ప్రారంభించాయి.
ఆంధ్రప్రదేశ్‌లో 11 పోస్టాఫీసులు, తెలంగాణలో 7 పోస్టాఫీసులను పాస్‌పోర్టు సేవా కేంద్రాలు ఎంపిక చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో అనంతపురం, చిత్తూరు, గుంటూరు, కడప, కాకినాడ, గుడివాడ (కృష్ణా), కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం పోస్టాఫీసులు ఉన్నాయి. తెలంగాణలో ఆదిలాబాద్, ఖమ్మం, మెదక్, మహబూబ్‌నగర్, నల్గొండ, సిద్దిపేట, వరంగల్‌ను ఏంపిక చేశారు. వీటితో పాటు ఏపీలో అమలాపురం, ఏలూరు, విజయనగరం, తెలంగాణలో జహీరాబాద్ పోస్టాఫీసులో కూడా సేవలు అందించేందుకు పోస్టల్ శాఖ సంసిద్ధం వ్యక్తం చేసింది.













