ఈ గడ్డకు సేవ చేసే హక్కు నాకు లేదా?…
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన నిరుద్యోగ ఆత్మహత్యలు ముమ్మాటికీ సీఎం కేసీఆర్ చేసిన హత్యలేనని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల స్పష్టం చేశారు. షర్మిల ప్రజాప్రస్తానం పాదయాత్ర భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం బూర్గంపాడు నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చేతిలో బంగారు తెలంగాణను పెడితే అప్పుల తెలంగాణ మార్చాడని ధ్వజమెత్తారు. హామీలు ఇచ్చి మోసం చేయడం సీఎం కేసీఆర్కు అలవాటుగా మారిందన్నారు. తాను వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డనన్న షర్మిల నా గతం ఇక్కడే భవిష్యత్ ఇక్కడే. ఈ గడ్డకు సేవ చేసే హక్కు నాకు లేదా? వైఎస్ఆర్ పేదల కోసం పనిచేశాడో నేను కూడా అలానే చేస్తా అన్నారు. వైఎస్ఆర్ సంక్షేమాన్ని తిరిగి తెస్తా అని ప్రకటించారు.













