అడ్వొకేట్ జనరల్ గా వేణుగోపాల్ నియామకం!
తెలంగాణ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ)గా పి.వేణుగోపాల్ నియమితులైనట్లు తెలిసింది. హైదరాబాద్‌కు చెందిన ఆయన హైకోర్టులో సీనియర్ న్యాయవాదిగా కొనసాగుతున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి 1977లో న్యాయశాస్త్రంలో పట్టా పొందిన ఆయన గతంలో ప్రభుత్వ న్యాయవాదిగాను, పలు సంస్థలకు స్టాండిరగ్ కౌన్సిల్‌గానూ పనిచేశారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అడ్వొకేట్ జనరల్‌గా కొంతకాలం ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ఏజీగా బీఎస్ ప్రసాద్ కొనసాగుతున్నారు. అయితే వేణుగోపాల్ నియామకంపై అధికారికంగా ఉత్తర్వులు వెలువడలేదు.













