టీఆర్ఎస్ లోకి వంటేరు ప్రతాప్ రెడ్డి
తెలంగాణలోని గజ్వేల్ నియోజకవర్గంలో కేసీఆర్‌పై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన వంటేరు ప్రతాప్‌రెడ్డి తన అనుచరులతో కలిసి తెలంగాణభవన్‌లో టీఆర్ఎస్లో చేశారు. టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం టీఆర్ఎస్లో చేరిన వంటేరు ప్రతాప్‌రెడ్డి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ఇతర నేతలతో కలిసి ప్రగతి భవన్‌కు వెళ్లి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని ప్రతాప్‌రెడ్డికి హామీ ఇచ్చారు.













