సభలోనే ఉన్నాం కానీ…ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసు : ఉత్తమ్
12 శాతం రిజర్వేషన్లపై గిరిజనులను టీఆర్ఎస్, బీజేపీ ఏవిధంగా మోసం చేస్తున్నాయో తెలంగాణలోని గిరిజనులందరూ గమనించాలని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. ఢిల్లీ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలని అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినప్పుడు సభలోనే ఉన్నాం. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో మాకేం తెలుసు. టీఆర్ఎస్ హయాంలో అసెంబ్లీ తీర్మానం చేయలేదని కేంద్ర ప్రభుత్వం చెబుతోందన్నారు. గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు అశంపై లోక్‌సభలో ప్రశ్నిస్తే ఇదేం దిక్కుమాలిన ప్రశ్న అని హరీశ్‌రావు అనడం దారుణమన్నారు. సమస్యను పక్కదారి పట్టించేందుకు హరీశ్‌రావు నాపై విమర్శలు చేశారన్నారు. కాంగ్రెస్ హయాంలో గిరిజనులకు ఇచ్చిన పోడు భూములను టీఆర్ఎస్ ప్రభుత్వం లాగేసుకుంటుందని విమర్శించారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజనుల పోడు భూములకు సంబంధించి ఒక్క పట్టా అయినా ఇచ్చారా? అని ప్రశ్నించారు.













