హైదరాబాద్లో పెట్టాలని అడిగితే.. గుజరాత్ లో పెట్టారు
ఇంటర్నేషనల్ ఆర్బిటరీ సెంటర్ను హైదరాబాద్లో పెట్టాలని అడిగితే గుజరాత్లో పెట్టారని టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణకు కేంద్రం ఒక శత్రువుగా వ్యవహరిస్తోందని అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ నిరాశగా మార్చిందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ప్రోత్సాహకాలు అందించడం లేదన్నారు. ఇంటింటికీ నీరు అందించామని, మరి తెలంగాణకు నిధులను కేంద్రం తిరిగి ఇస్తుందా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వాలని అడిగితే గతంలో పీయూష్ గోయల్ ఇవ్వలేదన్నారు. ఇప్పుడు తెలంగాణ బిడ్డ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెట్టారని ఆయన పేర్కొన్నారు.













