కాంగ్రెస్ సర్కార్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్: కవిత
ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని బోడుప్పల్లో భూ పోరాటానికి టీఆర్ఎస్ సిద్ధమైంది. ఇందులో భాగంగా బోడుప్పల్ చేరుకుని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత (Kavitha)ను బోడుప్పల్లో పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి బొల్లారం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ఉప్పల్‌లో ఈరోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని అన్నారు. మహిళలు, తెలంగాణ ఉద్యమకారులపై పోలీసులు (Police) విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను మాత్రమే అడిగాం తప్ప వేరే డిమాండ్లు ఏమీ అడగలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి నేటి నుంచి కౌంట్‌డౌన్ (Countdown) స్టార్ట్ అయ్యిందన్నారు. ఉద్యమకారులకు వాళ్లు ఇస్తామన్న 250 గజాల స్థలం ఇవ్వాలని మాత్రమే అడిగామని తెలిపారు. కచ్చితంగా ఉద్యమకారులకు ఇస్తామన్న హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అడిగితే ఉద్యమకారులపై లాఠీఛార్జ్ చేసి రక్తం చిందేలా కొట్టడం అన్యాయమన్నారు.








