ఈ పథకం కింద ఏ అభివృద్ధి పని అయినా చేసుకోవచ్చు : సీఎం చంద్రబాబు
వీబీ జీరామ్‌జీ గ్రామల ము”ఖచిత్రం మార్చే కార్యక్రమమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అన్నారు. దీనిపై ప్రధాని మోదీని అభినందించాలన్నారు. తిరుపతి జిల్లా ముక్కాలవారి పల్లెలో ఈ పథకాన్ని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ (Shivraj Singh), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan)తో కలిసి సీఎం శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ గతంలో ఉపాధి హామీని రాయలసీమ (Rayalaseema) నుంచే ప్రారంభించారని గుర్తు చేశారు. ఇప్పుడు మెరుగైన సవరణలతో వీబీ జీరామ్‌జీని తీసుకొచ్చారని పేర్కొన్నారు. కేంద్రం నుంచి రూ.7,700 కోట్లు, రాష్ట్ర వాటా రూ.4 వేల కోట్లు కలిసి మొత్తం రూ.11వేల కోట్ల పైనే ఈ పథకాన్ని ఖర్చు పెడుతున్నామన్నారు. ఈ పథకం కింద ఏ అభివృద్ధి పని అయినా చేసుకోవచ్చు. భూసార పరిరక్షణ, రహదారులు, డ్రైనేజీలు నిర్మించుకోవచ్చు. కొత్త ఆలోచనలు, విధానాలతో సమాజానికి మేలు చేసేలా కేంద్రం సంకల్పించింది. పనిని 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచడం సంతోషించే విషయం. దొంగ లెక్కలు రాసుకోనే విధంగా డిజిటల్ విధానం తీసుకొచ్చారు. పారదర్శకత కోసం రియల్‌టైమ్ మానిటరింగ్ ఉంటుంది అని తెలిపారు.








