ఇదే కాంగ్రెస్ పాలనలో జరిగితే దేశమంతా రాద్ధాంతం చేసే వాళ్లు కాదా? :జగ్గారెడ్డి
అయోధ్య రామమందిర విరాళాల అవినీతిపై ప్రధాని నరేంద్రమోదీ స్పందించి దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి (Jagga Reddy) డిమాండ్ చేశారు. గాంధీభవన్‌లో జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఇదే కాంగ్రెస్ పాలనలో జరిగితే దేశమంతా రాద్ధాంతం చేసే వాళ్లు కాదా? అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావును ప్రశ్నించారు. మోదీ (Modi), అమిత్‌షా (Amit Shah), యూపీ సీఎం యోగి (Yogi) పరిధిలోనే అయోధ్య ట్రస్టు ఏర్పాటైందని గుర్తు చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనపై కేటీఆర్‌తో చర్చకు తాను సిద్ధమని ప్రకటించారు. అయోధ్య రామమందిరం కోసం భక్తులు ఇచ్చిన విరాళాలను దోచుకుంటే దానిపై ప్రధాని మోదీ,
అమిత్షాలుగానీ, బీజేపీ నాయకులుగానీ ఎందుకు మాట్లాడటంలేదని ప్రశ్నించారు.








