రెస్టారెంట్‌కి వెళ్తే చాలు.. నోరూరించే 'క్రిస్పీ కార్న్' ఆర్డర్ చేయకుండా ఉండలేం కదా! చిన్న పెద్ద అందరికీ నచ్చే హాట్ ఫేవరెట్ స్నాక్ ఇది.
ఈ వంటకానికి తాజా లేదా ఫ్రోజెన్ స్వీట్ కార్న్ బాగుంటుంది. దేశవాళీ మొక్కజొన్న కంటే స్వీట్ కార్న్ అయితేనే జ్యుసీగా, టేస్టీగా ఉంటుంది.
స్వీట్ కార్న్ ఎంపిక
ముందుగా నీటిలో కొద్దిగా ఉప్పు వేసి, కార్న్ గింజలను 4-5 నిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత నీటిని పూర్తిగా వడకట్టి ఆరబెట్టాలి.
ఉడికించడం
ఆరిన గింజలకు మైదా, కార్న్ ఫ్లోర్, బియ్యం పిండి సమపాళ్లలో చల్లాలి. ఈ పొడుల కాంబినేషనే కార్న్‌కు సూపర్ క్రిస్పీ టెక్స్చర్ ఇస్తుంది.
కోటింగ్ సీక్రెట్
పిండితో పాటు తగినంత ఉప్పు, మిరియాల పొడి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి గింజలకు బాగా పట్టేలా డ్రైగా టాస్ చేయాలి.
మసాలాల మిక్సింగ్
పిండి కోటింగ్ ఎక్కువైతే నూనె పాడవుతుంది. అందుకే వేయించే ముందు ఎక్స్‌ట్రా ఉన్న పొడి పిండిని జల్లెడ సాయంతో తొలగించాలి.
జల్లెడ పట్టడం
బాగా కాగిన నూనెలో మీడియం ఫ్లేమ్‌పై వేయించాలి. గింజలు ఒక్కోసారి పేలుతాయి, కాబట్టి మూత అడ్డు పెట్టుకుని జాగ్రత్తగా వేపాలి.
ఫ్రైయింగ్ టిప్స్
రెస్టారెంట్ స్టైల్ క్రంచ్ కోసం.. కార్న్‌ను ఒక నిమిషం వేపి తీసి, మళ్లీ హై ఫ్లేమ్ నూనెలో గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలి.
డబుల్ ఫ్రై ట్రెండ్
వేగిన క్రిస్పీ కార్న్‌ను ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, చాట్ మసాలా లేదా పెరి పెరి పౌడర్‌తో వేడిగా టాస్ చేయాలి.
టాసింగ్ మ్యాజిక్
చివరగా కొద్దిగా నిమ్మరసం పిండితే, వేడి వేడి చట్‌పటా క్రిస్పీ కార్న్ రెడీ! ఆలస్యం చేయకుండా వెంటనే తింటేనే దీని క్రంచ్ అదిరిపోతుంది.