బుచ్చిబాబుకు చరణ్ అండ.. కొత్త ఆఫీస్‌తో నెక్స్ట్ మూవీ స్టార్ట్!
రామ్ చరణ్(ram charan)తో తెరకెక్కించిన పెద్ది(peddi) సినిమా రిలీజై మంచి సక్సెస్ అందుకున్న వేళ, డైరెక్టర్ బుచ్చిబాబు(buchibabu) తన తదుపరి ప్రాజెక్ట్‌పై కూడా వేగంగా అడుగులు వేస్తున్నట్లు ఫిల్మ్‌నగర్‌లో డిస్కషన్ సాగుతోంది. ఇప్పటికే సుకుమార్(sukumarn)తో చేయబోయే సినిమా తర్వాత మరోసారి బుచ్చిబాబుతో కలిసి పని చేయాలనే ఆసక్తిని రామ్ చరణ్ వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుచ్చిబాబుకు ప్రముఖ నిర్మాతతో అడ్వాన్స్ ఇప్పించే విషయంలో కూడా చరణ్ కీలక పాత్ర పోషించినట్లు టాక్ వినిపిస్తోంది. ఇదే వారంలో కొత్త ఆఫీస్‌ను ప్రారంభించి, తర్వాతి సినిమా ప్రీప్రొడక్షన్ వర్క్స్ ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తోంది.
ఇటీవల పెద్ది ప్రమోషన్స్ సందర్భంగా బుచ్చిబాబు కూడా ఈ విషయాన్ని పరోక్షంగా ధృవీకరించాడు. రామ్ చరణ్‌కు ఇప్పటికే కొత్త కథ లైన్ చెప్పానని, అది ఆయనకు నచ్చిందని వెల్లడించాడు. ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసిన తర్వాత మరిన్ని డిస్కషన్స్ జరుగుతాయని చెప్పిన బుచ్చిబాబు, ప్రస్తుతం కథను మరింత బలోపేతం చేసే పనిలో నిమగ్నమైనట్లు సమాచారం. సుకుమార్ సినిమా పూర్తయ్యే సమయానికి పూర్తిస్థాయి స్క్రిప్ట్‌తో సిద్ధంగా ఉండాలనే టార్గెట్ తో ఆయన కసరత్తులు ప్రారంభించినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.
అన్నీ అనుకున్నట్లుగా జరిగితే సుకుమార్(sukumar) ప్రాజెక్ట్ తర్వాత రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబినేషన్ మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెద్ది సినిమాతో ఇద్దరి మధ్య పెరిగిన నమ్మకం ఈ కొత్త ప్రాజెక్ట్‌కు బలంగా మారే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇంకా వెలువడాల్సి ఉన్నప్పటికీ, కొత్త ఆఫీస్ ప్రారంభం, నిర్మాత అడ్వాన్స్, స్క్రిప్ట్ పనులు వంటి పరిణామాలు ఈ కాంబినేషన్‌పై ఇండస్ట్రీలో ఆసక్తిని మరింత పెంచుతున్నాయి.








