హీరో మోటార్స్ సంస్థకు చెందిన గ్లోబల్ పార్ట్స్ సెంటర్ 2.0 ప్లాంట్ శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు
రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అయిన పీ4 కార్యక్రమంలోనూ భాగస్వామిగా ఉన్న హీరో సంస్థ
పీ4లో భాగంగా మార్గదర్శిగా వ్యవహరిస్తూ పేదలకు అండగా నిలుస్తోన్న హీరో మోటార్స్ సంస్థ
స్వర్ణాంధ్ర ఫౌండేషన్ ద్వారా డాక్టర్ బ్రిజ్ మోహన్ లాల్ ముంజల్ హీరోస్ ఆఫ్ టుమారో పేరిట స్కాలర్ షిప్ లను అందించడానికి ముందుకు వచ్చిన హీరో సంస్థ
ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా స్కాలర్ షిప్ లు అందించే కార్యక్రమాన్ని ప్రారంభించిన హీరో సంస్థ
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ…
• హీరో వ్యవస్థాపక ఛైర్మన్ బ్రిజ్ మోహన్ లాల్ ముంజాల్ పారిశ్రామిక వేత్తే కాదు.. జాతి నిర్మాణానికి సహకరించిన మహనీయుడు.
• హీరో మోటార్స్ సంస్థ వేరే రాష్ట్రంలో ప్లాంట్ పెట్టాలనుకుంటే వారితో ప్రత్యేకంగా చర్చించి ఏపీలో ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ఒప్పించాం.
• 2018లో తిరుపతిలో శంకుస్థాపన చేసిన హీరో మోటార్స్ ప్లాంట్ ఇప్పుడు పెద్ద ఎత్తున వాహనాలను ఉత్పత్తి చేస్తోంది.
• ఇప్పుడు వీడా పేరుతో టూవీలర్ ఈవీలను ఉత్పత్తి చేయడం సంతోషంగా ఉంది.
• హీరో సంస్థకున్న అన్ని సెంటర్లకంటే శ్రీసిటీలోని సెంటరే అతి పెద్ద సెంటర్ గా అభివృద్ధి చేయాలి.
• ప్లాంట్ ఏర్పాటులో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తాం… అలాగే ప్లాంట్ ను త్వరితగతిన పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించాలి.
• హీరో సంస్థ ఎగ్జిక్యూటీవ్ ఛైర్మన్ పవన్ ముంజాల్ చెప్పిన విధంగా రూ. 3200 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన పనులు కూడా ప్రారంభించాలని కోరుతున్నా.
• భవిష్యత్ అంతా ఈవీలదే… డిమాండ్ కు తగ్గట్టు ఈవీల ఉత్పత్తికి హీరో సంస్థ సిద్దంగా ఉండాలి.
• ఇవాళ గ్లోబల్ పార్ట్స్ సెంటర్ 2.0 శంకుస్థాపన చేసుకోవడం ఆనందంగా ఉంది.
• ఏపీ గ్రీన్ ఎనర్జీ రంగంలో 160 గిగా వాట్ల ఉత్పత్తికి ప్రణాళికలు సిద్దం చేసుకున్నాం.. ఇప్పటికే 100 గిగా వాట్ల విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన ఒప్పందాలు కుదుర్చుకున్నాం.
• ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఐటీని ప్రమోట్ చేశాం… వివిధ రంగాల్లో సంస్కరణలు తెచ్చాం.
• హీరో సంస్థలో పని చేసే ఉద్యోగుల్లో 40 శాతం మంది మహిళలే ఉన్నారు.
• ఆంధ్రప్రదేశ్ మహిళలు కష్టపడి పని చేస్తారు… త్వరగా నేర్చుకుంటారు.
• రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి విప్లవాత్మక చర్యలు తీసుకుంటున్నాం.
• గతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మాట్లాడేవాళ్లం… ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అమలు చేస్తున్నాం.
• ఏపీలో రోడ్, రైలు, వాటర్, ఎయిర్ కనెక్టివిటీ అద్భుతంగా ఉంది.
• పొలాలకు సమృద్ధిగా నీళ్లందిచడంతోపాటు పరిశ్రమలకు నీళ్లు అందించగలం.
• రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిలో రైతులను భాగస్వాములను చేస్తున్నాం.
• అమరావతి రాజధాని నిర్మాణానికి 29 వేల మంది రైతులు భూములు ఇచ్చి త్యాగం చేశారు.
• అమరావతి రైతులను రాజధాని అభివృద్ధిలో భాగస్వాములను చేశాం.
• పరిశ్రమలతో ఒప్పందాలు కుదుర్చుకోవడంతోపాటు.. ఆ పరిశ్రమల ఏర్పాటుకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తాం.
• పరిశ్రమల ఏర్పాటుకు కావాల్సిన మౌళిక సదుపాయాలు కల్పిస్తాం… అన్ని రకాలుగా సహకరిస్తాం.
• విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తోంది… మరికొన్ని డేటా సెంటర్లు ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తున్నాయి.
• అయితే వనరులను దృష్టిలో పెట్టుకుని డేటా సెంటర్ల ఏర్పాటు విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తాం.
• ఇటీవలే జొన్నగిరిలో గోల్డ్ ఫీల్డ్ ను ప్రారంభించాం
• ఏపీలో అన్ని రకాల ఖనిజాలు లభ్యమవుతాయి.
• అమరావతిలో త్వరలో క్వాంటం కంప్యూటర్ ప్రారంభించబోతున్నాం.
• క్వాంటం కంప్యూటర్ తయారీకి అమరావతి కేంద్రంగా ఉండబోతోంది.
• ఎల్లుండి కడపలో స్టీల్ ప్లాంట్ పనులు పునఃప్రారంభించబోతున్నాం.
• గ్రీన్ ఎనర్జీ, పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి రంగాలపై ఫోకస్ పెట్టాం.
• తిరుపతిలోని మహిళా పోలీసులకు టూవీలర్ ఈవీలను ఇవ్వడానికి ముందుకు వచ్చిన హీరో మోటార్స్ సంస్థకు ధన్యవాదాలు.
• పీ4 విధానం ద్వారా ధనికులు పేదవారిని ఆదుకునేలా మేం చేపట్టిన కార్యక్రమం సక్సెస్ అయింది.
• సంపద సృష్టిస్తూనే అందులో పేదలకు ఫలాలు దక్కాలనే దిశగా మా ప్రభుత్వం పని చేస్తోంది.
• అసమానతలు లేని సమాజం కోసం అందరం కృషి చేయాలి.
• అలాగే వన్ ఫ్యామ్లీ-వన్ ఎంటర్ ప్రెన్యూర్ నినాదంతో పని చేస్తున్నాం.
• డ్వాక్రా మహిళలను పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతున్నారు.
• కొన్ని కార్పోరేట్ కంపెనీలైనా బ్యాంక్ రుణాలను సకాలంలో చెల్లించవేమో కానీ.. మా డ్వాక్రా మహిళలు మాత్రం బ్యాంకు రుణాలను క్రమం తప్పకుండా చెల్లిస్తారు.









