జుట్టు రాలడం ఈ రోజుల్లో అందరి సమస్యే. వంటగదిలో ఉండే ఉల్లిపాయతో ఈ సమస్యకు సులువుగా చెక్ పెట్టవచ్చని మీకు తెలుసా?
తాజా పరిశోధనల ప్రకారం, ఉల్లిపాయ నూనె తలలో రక్త ప్రసరణను పెంచి, కేవలం 6 వారాల్లోనే కొత్త జుట్టు మొలిచేలా చేస్తుంది.
ఇందులోని సల్ఫర్, జుట్టు బలానికి కావలసిన కెరాటిన్ ప్రోటీన్ ఉత్పత్తిని పెంచి, కుదుళ్లను స్ట్రాంగ్‌గా మారుస్తుంది.
ఈ ఆయిల్ జుట్టు వేర్ల లోపలికి వెళ్లి పోషణ ఇస్తుంది. దీనివల్ల బ్రష్ చేసినప్పుడు జుట్టు ఊడిపోవడం బాగా తగ్గుతుంది.
ఉల్లిపాయలోని యాంటీ ఫంగల్ గుణాలు చుండ్రుకు కారణమయ్యే ఇన్ఫెక్షన్లను తరిమికొట్టి, స్కాల్ప్‌ను క్లీన్‌గా ఉంచుతాయి.
ఇది కేవలం జుట్టు పెంచడమే కాదు, ప్రతి జుట్టు పొగునూ మందంగా మార్చి తల నిండుగా, ఒత్తుగా కనిపించేలా చేస్తుంది.
వారానికి 2 నుండి 3 సార్లు ఈ నూనెతో తలపై బాగా మసాజ్ చేయాలి. రోజువారీ వాడకం వల్ల జిడ్డు ఎక్కువయ్యే అవకాశం ఉంది.
స్త్రీలు, పురుషులు ఇద్దరూ దీన్ని వాడవచ్చు. జుట్టు పలచబడటం, బట్టతల సమస్యలు లేదా హెయిర్ ఫాల్ సమస్యతో ఇబ్బంది పడే ఎవరికైనా ఇది మంచి ఎంపిక.