నేడు తెలంగాణ మహానాడు
తెలంగాణ తెలుగుదేశం పార్టీ మహానాడు హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నేడు జరగనుంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మహానాడుకు హాజరుకానున్నారు. నేడు ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. తెలుగుదేశం పార్టీ జాతీయ మహానాడు ఈ నెల 27, 28, 29 తేదీల్లో విజయవాడలో జరగనుంది. దీనికి సన్నాహకంగా రాష్ట్రస్థాయిలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహిస్తోంది. మహానాడు సందర్భంగా ఎనిమిది అంశాలపై తీర్మానాలు చేయాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. 2019లో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఏడాదిలోపే సమయం ఉండటంతో నేడు జరిగే మహానాడు ప్రాధాన్యం సంతరించుకుంది.













