ఢిల్లీ పబ్లిక్ స్కూల్, సికింద్రాబాద్ లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు
శ్రీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారి సారధ్యంలో నిర్వహించబడుతున్న విద్యానంద విద్యాసంస్థలకు చెందిన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సికింద్రాబాద్ యందు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు “కోటి రతనాల వీణ- మన తెలంగాణ ” అనే శీర్షికన అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ప్రపంచ చరితలో చెరగని అధ్యాయం తెలంగాణ సాయుధ పోరాటం అంటూ విముక్తి నుండి విభజన దాకా సాగిన వివిధ ఘట్టాలను విద్యార్థులు ప్రదర్శించిన తీరు అభినందనీయం. ప్రగతికి తార్కాణంగా నిలిచిన తెలంగాణ ప్రభుత్వ పతకాలను గూర్చి విద్యార్థులు ఉపన్యసించిన తీరు అందరిని ఆకట్టుకుంది. “పుడమిక పులకింత- బతుకమ్మ” అంటూ రాష్ట్ర సంస్కృతిలో భాగంగా నిలిచిన ‘బతకమ్మ’ దృశ్యకథను అందరిని ఆకట్టుకుంది.
సింగిడి రంగుల పూదోట అను శీర్షికను ‘ రే లా రె రే లా రె – నీళ్ళలో నిప్పల్లే నిలిచింది తెలంగాణ’ అంటూ చేసిన బృందగానం ఆహుతులందరిని ఆకట్టుకుంది. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు నిలయమైన జానపద నృత్య ప్రదర్శనలో పోతరాజు విన్యాసాలు, గ్రామదేవతలకు సమర్పించిన బోనం, లంబాడా లాస్యం, డప్పుల దరువు సభా ప్రాగణంలోని విక్షకులందరిని ఆనంద పరిచింది.
ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయిని శ్రీమతి శైలజగోపీనాథ్ గారు విధ్యర్డులనుద్దేశించి ఉపన్యాసిస్తూ, తమ సంస్కృతీ సంప్రదాయాలను ఎప్పటికి పరచిపోరాదని అమరవీరుల త్యాగని కొనియాడారు. నూతనంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం, ప్రభుత్వ పథకాలు ఇతర రాష్ట్రలకు ఆదర్శప్రాయంగా నిలుస్తాయన్ని గుర్తు చేశారు.
మరిన్ని వివరాలకు..
రాజేష్@ 7702220228













