ఆయన పేరు తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా
సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా భావించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ని దేశంలోనే నవంబర్ వన్‌గా నిలబెట్టిన నాయకుడు వైఎస్ఆర్ అని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. దివంగత సీఎం వైఎస్ఆర్ జయంతి ఈ సందర్భగా పంజాగుట్ట వైఎస్ఆర్ విగ్రహానికి నివాళలర్పించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నాయకుడిగా వైఎస్ఆర్ ఎప్పుడూ ప్రజల గుండెల్లోనే ఉంటారని కొనియాడారు. ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పార్టీపై చేస్తున్న కుట్రలు తిప్పికొట్టేందుకు వైఎస్ఆర్ మన మధ్య లేకపోవడం దురదృష్టకరం అన్నారు. వైఎస్ హయాంలో రాష్ట్ర ప్రజలు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారు. జలయజ్ఞం ద్వారా లక్షలాది ఎకరాలకు సాగు నీరు అందించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ని దేశమే ఆదర్శంగా తీసుకునేలా సంక్షేమం, అభివృద్ధి చేసి చూపించారు. వారు అమరులైనా ఆయన పేరు తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోయింది. వైఎస్ఆర్ ఆలోచనలు కొనసాగించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది అని పిలుపునిచ్చారు.













