కాంగ్రెస్ కు చిరుమర్తి షాక్
అటు పార్లమెంటు, ఇటు మండలి ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌కు మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన మరో శాసనసభ్యుడు తెలంగాణ రాష్ట్ర సమితి తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధపడుతున్నారు. కాంగ్రెస్ నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆయన నివాసంలో కలిసినట్లు తెలిసింది. ఈ సందర్భంగా ఆయన టీఆర్ఎస్లో చేరేందుకు ఆసక్తిని చూపగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదించినట్లు తెలుస్తోంది.
ఈ నెల 2న టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్యేలకు ఏర్పాటు చేసిన విందుకు చిరుమర్తి లింగయ్య గైర్హాజరు కావడంతో ఆయనపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. లింగయ్య 2009లో, 2018లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. కోమటిరెడ్డి సోదరులకు ఆయన సన్నిహితుడు. ఎన్నికలకు ముందు ఆయనకు టికెట్‌పై ఊగిసలాట ఉండగా కోమటిరెడ్డి సోదరులు పట్టుబడి టికెట్ ఇప్పించారు. లింగయ్య పార్టీ పార్టీ మారుతారంటూ గత కొన్నిరోజులుగా ప్రచారం జరుగుతుంది. ఈ నెల 10న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పార్టీ అధిష్ఠానం సమావేశం ఏర్పాటు చేస్తోంది. ఈ సమావేశానికి సండ్ర, కాంతారావు, సక్కులతో పాటు లింగయ్యలను టీఆర్ఎస్ ఆహ్వానించినట్లు సమాచారం.













