తెలంగాణ మంత్రివర్గంలో మరో ఆరుగురికి చోటు
తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గం సంపూర్ణంగా కొలువుతీరింది. కొత్తమంత్రులతో ప్రమాణంతో మంత్రిమండలిలో ఇప్పటివరకు ఉన్న మంత్రుల సంఖ్య 12 నుంచి 18కి పెరిగింది. రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ తమిళసై సౌందర్‌రాజన్ కొత్త మంత్రులతో ప్రమాణం చేయించారు. సిద్దిపేట ఎమ్మెల్యే టీ హరీశ్ రావు ( ఆర్థికశాఖ ) కేటీఆర్ (పరిశ్రమలు, పురపాలక, ఐటీ శాఖ), మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి (విద్యాశాఖ), ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ (గిరిజన, మహిళా, శిశు సక్షేమం), కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ (పౌరసరఫరాలు, బీసీ సంక్షేమం), ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌కు (రవాణా శాఖ) మంత్రివర్గంలో చోటుదక్కింది.
హరీశ్‌రావు గతంలో నీటిపారుదల, మార్కెటింగ్ శాలు నిర్వహించగా ఈసారి ఆర్థిక శాఖ కేటాయించారు. కేటీఆర్‌కు గతంలో నిర్వహించిన శాఖలే మళ్లీ అప్పగించారు. మంత్రి జగదీశ్‌రెడ్డికి విద్యుత్‌శాఖ బాధ్యలు అప్పగించగా, సాధారణ పరిపాలన, శాంతి భద్రతలు, రెవెన్యూ నీటిపారుదల శాఖలను సీఎం కేసీఆర్ తన వద్దే పెట్టుకున్నారు.













