ఎన్నికల్లో గెలుపుకోసమే రాహుల్ పర్యటన
వచ్చే ఎన్నికల్లో గెలుపుకోసం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వివిధ చోట్ల పర్యటిస్తున్నారు. పార్టీ గెలుపుకు అవసరమైన వ్యూహాలను కూడా సిద్ధం చేస్తూ, రాహుల్ గాంధీ ద్విముఖ వ్యూహంతో ముందుకెళ్తున్నారు. ఓ వైపు కలిసొచ్చే పార్టీలతో జట్టు కడుతూ మరోవైపు సొంతంగా పార్టీని బలోపేతం చేయడంపై దృష్టిపెట్టారు. యూపీ ఉప ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీతో, కార్నాటకలో జేడీఎస్తోను కలిసి బీజేపీకి షాకిచ్చిన రాహుల్ ఇప్పడు మరింత స్పీడ్ పెంచారు. ఉత్తరాదిలో బీజేపీపై ఉన్న వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకునేందుకు ఇప్పటికే ఆయన రాజస్థాన్లో పర్యటించారు. ఇదే సమయంలో దక్షిణాదిపై తెలంగాణలో పార్టీని గాడిలో పెట్టాలని నిర్ణయించుకున్నారు. తెలంగాణ ఇచ్చి కూడా ప్రయోజనం లేకపోవడంతో ఈ సారి ఎలాగైన కాంగ్రెస్ జండా ఎగురవేయాలనే పట్టుదలతో ఉన్నారు. ఇప్పటికే ముగ్గురు దూతలను తెలంగాణకు పంపి వారితో నివేదికలు తెప్పించుకున్నారు. తెలంగాణ కాంగ్రెస్ అధికారంలోకి రావటం పెద్ద కష్టమేమి కాదని వారు నివేదికలిచ్చారు. రాష్ట్ర స్థాయి నేతల మధ్య ఐక్యత లేదని, అయితే ఎక్కిడక్కడ బలమైన నేతలు కాంగ్రెస్కు విజయం సాధించిపెట్టగలరని లెక్కలేశారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్లో రాహుల్ అడుగుపెడుతున్నారు.













