19న ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన
వందేభారత్ రైలు తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభం కానుంది. కొద్ది నెలలుగా తెలుగు ప్రజలు ఎదురు చూస్తున్న వందేభారత్ అధికారిక ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్ అయింది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 19న హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. సికింద్రబాబాద్ రైల్వే స్టేషన్ వేదికగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య తొలి వందేభారత్ రైలును ప్రారంభించనున్నారు. ముందుగా ఈ రైలు సికింద్రాబాద్ నుంచి విజయవాడ మధ్య నడవనుంది. ఆ తరువాత ఇదే రైలును విశాఖ వరకు పొడిగించేందుకు ఆలోచన చేస్తున్నారు. ఈ రైలు ద్వారా సికింద్రాబాద్ నుంచి విజయవాడకు నాలుగు గంటల్లోనే చేరుకునే అవకాశం కలుగుతుంది. వందేభారత్‌ను ప్రారంభించటంతో పాటు సికింద్రబాద్ రీడైవలప్మెంట్ పనులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. ఇందు కోసం రూ.699 కోట్లు ఖరు చేయనున్నారు. ప్రస్తుత భవనాలను కూల్చి అంతర్జాతీయ ప్రమాణాలు, పూర్తిస్థాయి వసతులతో నూతనంగా నిర్మించనున్నారు.













