ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి కి ఈడీ షాక్!
ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి ఈడీ షాక్ ఇచ్చింది. రోహిత్ రెడ్డి అభ్యర్థను ఈడీ అధికారులు తిరస్కరించారు. ఆయన లేఖను ఈడీ పరిగణనలోకి తీసుకోకపోవడంతో విచారణకు రోహిత్ రెడ్డి హాజరు కానున్నారు. విచారణకు హాజరు కాలేనని లాయర్‌తో ఈడీకి రోహిత్‌రెడ్డి లేఖ పంపించారు. విచారణకు హాజరయ్యేందుకు చాలా తక్కువ సమయం ఇచ్చారని, వరుస సెలవులు కారణంగా బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్స్, ఇతర డాక్యుమెంట్లు తీసుకోలేకపోయానని రోహిత్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. అయితే రోహిత్ రెడ్డి విజ్ఞప్తిని ఈడీ అధికారులు తిరస్కరించారు.













